చాక్లెట్ ఆశ చూపి మైనర్ బాలికలపై అత్యాచారం: ఐఏఎస్ అధికారి అరెస్టు
పూణె: మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో 58 ఏళ్ల ఐఎఎస్ అధికారిని పూణెలో అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అతని పేరు మారుతి హెచ్ సావంత్. మహారాష్ట్రలోని అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
పూణెలోని శివాజినగర్‌లో నివసించే ఇతను తరచూ హింగానే ఖుర్ధ్ ప్రాంతంలోని తన మామ ఇంటికి వెళుతుండేవాడు. అక్కడి హౌసింగ్ సొసైటీ పార్కింగ్ స్ధలంలో ఆడుకునేందుకు వచ్చే పాఠశాల విద్యార్ధినులకు చాక్లెట్లు, డబ్బు ఆశచూపి వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసులు వెల్లడించారు.

గదిలోకి తీసుకెళ్లగానే ముందు ఆ బాలికలకు తన కంప్యూటర్‌లో అశ్లీల చిత్రాలు చూపేవాడని, ఆ తర్వాత తన కోరిక తీర్చుకునే వాడు. బాధిత బాలికలు అందరూ పదేళ్ల లోపువారేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలికలు జరిగిన అఘాయిత్యాలను పాఠశాల కౌన్సిలర్‌కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ కౌన్సిలర్ పాఠశాల హెచ్‌ఎంకు విషయం చెప్పగా, ఆమె స్ధానిక కార్పోరేటర్‌కు తెలిపింది. ఆ కార్పోరేట్ దంపతులు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో ఆ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications