బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నడనాట జేమ్స్ జాతర: పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు: భావోద్వేగంతో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. ఇవ్వాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయిదు భాషల్లో సినిమా విడుదల అయింది. సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి కూడా ఇవ్వాళే కావడంతో కర్ణాటకలో పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద జేమ్స్ జాతర కనిపించింది. తమ ఆరాధ్య హీరో చివరి మూవీని అభిమానులు భావోద్వేగంతో వీక్షించారు. ఆయన లేడనే విషయాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

గత ఏడాది గుండెపోటుతో..

గత ఏడాది గుండెపోటుతో..

గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. జిమ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణవార్త భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తాన్నీ కన్నీటి సంద్రంలో ముంచివేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొదలుకుని ప్రతి ఒక్కరూ ఆయన హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అన్ని భాషల చలన చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది.

అయిదు భాషల్లో..

అయిదు భాషల్లో..

ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్ కుమార్ దర్శకుడు. కిశోర్ పత్తికొండ ఈ సినిమాను నిర్మించారు. ప్రియా ఆనంద్, తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు శరత్ కుమార్, తిలక్ శేఖర్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలను పోషించారు. పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసే సమయానికి జేమ్స్ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

కర్ణాటక.. అప్పుమయం..

కర్ణాటక.. అప్పుమయం..

ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై ఈ మూవీని విడుదల చేసింది యూనిట్. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న తమ ఆరాధ్య హీరో నటించిన చివరి చిత్రం విడుదల కావడంతో పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల ఆనందానికి హద్దు లేదు. కర్ణాటక మొత్తం పునీత్ మయం అయిపోయింది. జేమ్స్ జాతర నెలకొంది. థియేటర్లన్నీ హైఓల్టేజ్ పవర్ స్టేషన్లుగా మారాయి. అర్ధరాత్రి నుంచే థియేటర్ల ముందు బారులు తీరి నిల్చున్నారు అభిమానులు.

థియేటర్ల వద్ద జాతర..

థియేటర్ల వద్ద జాతర..


పునీత్ రాజ్‌కుమార్ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలకు లెక్కే లేదు. పునీత్ కటౌట్లకు పూజలు చేశారు. టెంకాయలు కొట్టారు. బెంగళూరులోని దాదాపు అన్ని థియేటర్లల్లో ఈ సినిమాను మార్నింగ్ షోగా ప్రదర్శించారు. థియేటర్లు, ప్రధాన కూడళ్లల్లో పునీత్ రాజ్‌కుమార్ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టారు. అన్నదానం చేశారు. ఒక్క బెంగళూరులోనే కాకుండా రామనగర, మైసూర్, హసన్, మంగళూరు, బెళగావి, విజయపుర, కలబురగి, దావణగెరె.. ఇలా అన్ని నగరాలు, పట్టణాల్లో జేమ్స్ జాతర నెలకొంది.

సినిమా చూసిన పునీత్ కుటుంబం..

సినిమా చూసిన పునీత్ కుటుంబం..

సినిమా చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన హీరో నుంచి మరో సినిమా ఇక రాబోదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు వీరభద్రేశ్వర థియేటర్‌లో తొలి షోను వేశారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, యువరాజ్ కుమార్, వినయ్ రాజ్‌కుమార్‌తో పాటు చిత్ర దర్శకుడు చేతన్ కుమార్, నిర్మాత కిశోర్ పత్తికొండ, హీరోయిన్ ప్రియా ఆనంద్ వీక్షించారు.

Recommended Video

Puneeth Rajkumar: చిత్ర పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది.. దిగ్భ్రాంతి లో క్రీడాలోకం| Oneindia Telugu
సమాధికి నివాళి..

సమాధికి నివాళి..


పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని కంఠీరవ స్టూడియోలో గల ఆయన సమాధాని అలంకరించారు. అన్న సంతర్పణను ఏర్పాటు చేశారు. ఇవ్వాళ ఒక్క రోజే లక్ష మందికి పైగా భోజనాన్ని వడ్డించేలా సన్నాహాలు చేశారు. జయంతి నాడు పునీత్ రాజ్‌కుమార్‌ను దర్శించడానికి అభిమానులు పోటెత్తారు. కంఠీరవ స్టూడియోకు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే కంఠీరవ స్టూడియో అభిమానులతో నిండిపోయింది. ఆయనకు నివాళి అర్పిస్తూ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

English summary
Puneeth Rajkumar's fans can be seen celebrating in almost all corners of the state despite Section 144 being imposed in several places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X