సిద్దూకు గ్యాంగ్‌స్టార్స్ నుంచి బెదిరింపులు.. డబ్బులు అడగడంతోనే: మికా సింగ్
పంజాబ్ సింగర్ సిద్దూ హత్యపై మరో సింగర్ మికా సింగ్ స్పందించారు. అతనికి గ్యాంగ్ స్టార్స్ నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. అతని హత్య కేసులో గ్యాంగ్ స్టార్స్ పాత్ర ఉందని ఆరోపించారు. నాలుగేళ్ల క్రితమే అతనికి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఈ సారి కొందరు అతని నుంచి డబ్బులు వసూల్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
గత వారం అతను ముంబై వచ్చాడని గుర్తుచేశారు. ముంబైలో స్వేచ్చగా తిరగగలుగుతున్నానని చెప్పారు. ఇక్కడ భద్రత లేకుండా తిరగొచ్చు అని చెప్పారు. అయితే అతనిని ముంబై రావాలని సూచించానని వివరించారు. సిద్దూకు మంచి ఫాలొయింగ్ ఉందని చెప్పారు. మూడేళ్లలో మంచి పేరును సంపాదించారని వివరించారు. ఒక్క పంజాబే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించగలిగారని వివరించారు.

పాటలతో వాస్తవ అంశాలను ప్రస్తావించేవారని తెలిపారు. అలా సిద్దూ విజయం సాధించాడని.. ఇదీ నేరమా అని మికా సింగ్ ప్రశ్నించారు. అతని పాటలు ఒక టెంపో క్రియేట్ చేశాయని తెలిపారు. సిద్దూపై కాల్పులు జరిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంజాబ్ సింగర్ సిద్దూ మూసె వాలాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మన్సా జిల్లాలో గల జవహర్కె గ్రామంలో ఆదివారం సిద్దూపై ఫైర్ జరిగింది. పంజాబ్ పోలీసులు 424 మందికి భద్రతా విత్ డ్రా చేశారు. ఆ మరునాడే సిద్దూపై అటాక్ చేశారు. మాన్సా నుంచి సిద్దూ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అయితే ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లాపై 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, మరో ఆస్పత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన థార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications