వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో కుదుపు: 8మంది మంత్రులు రాజీనామా, వీరే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలపడంతో కాంగ్రెసు పార్టీలో రాజీనామాలు ఊపందుకున్నాయి. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు పలువురు రాజీనామాలు చేశారు. పార్టీకి, పదవులకు వారు గుడ్ బై చెప్పారు.

కేంద్రమంత్రి పురంధేశ్వరి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి ఫ్యాక్స్ చేశారు.

రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, గల్లా అరుణ కుమారిలు రాజీనామా బాట పట్టారు. వీరు పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు.

శైలజానాథ్, పార్థసారథి, కాసు, మహీధర్ రెడ్డిలు కేవలం పదవులకే రాజీనామా చేశారు. పార్టీకి చేయలేదు.

ఎమ్మెల్యేల్లో... రమేష్ బాబు (పెందుర్తి), అన్నె రాంబాబు (గిద్దలూరు), సురేష్ (యర్రగొండపాలెం), షాజహాన్ బాషా (మదనపల్లె) పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్ (భీమిలి), చింతలపూడి వెంకట్రామయ్య (గాజువాక), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), దగ్గుబాటి వెంకటేశ్వర రావు (పర్చూరు) పార్టీకి రాజీనామా చేశారు.

ఎమ్మెల్యేలు సికె బాబు (చిత్తూరు) పదవికి రాజీనామా చేశారు.

టిడిపి ఎమ్మెల్యేల్లో...

రాష్ట్ర విభజనను నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. పయ్యావుల కేశవ్, పరిటాల సునిత, పల్లె రఘునాథ్ రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, పార్థసారథి, అబ్దుల్ ఘనీ, టివి రామారావు, చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావులు పదవులకు రాజీనామా చేశారు.

English summary
Hours after Lok Sabha passed the Telangana Bill, Union Minister of State for Commerce and Industry and Vizag MP D Purandewari resigned from the Congress and the council of ministers in protest of the division of Andhra Pradesh. Sources said Purandeswari faxed her resignations to Prime Minister Manmohan Singh as well as Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X