రెండు దారుణాలు: ర్యాగ్ పికర్, బెగ్గర్లపై రేప్, హత్య
సేలం: తమిళనాడు రాష్ట్రంలోని సేలం నగరంలో రెండు వేర్వేరు సంఘటనలో మహిళలపై అత్యంత దారణమైన దాడులు జరిగాయి. ఓ ర్యాగ్ పికర్ (చెత్త ఏరుకుని బతికే మహిళ), బిచ్చగత్తె హత్యకు గురై కనిపించారు. వారిపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసులు చెప్పారు. సేలంలో వారి మృతదేహాలు మంగళవారం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
నలబై ఏళ్ల పడిలో ఉన్న ర్యాగ్ పికర్ తలపై గాట్లతో నగ్నంగా గోరిమెడులోని ఓ హోటల్‌లో శవమై తేలింది. బిచ్చగత్తె రద్దీగా ఉండే ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ శవమైన కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ర్యాగ్ పికర్ శవం హోటల్ లోపల కనిపించినట్లు, యజమాని రెండు రోజుల పాటు బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత చూడగా ఆ శవం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. యజమాని లేని సమయంలో వర్కర్ అంతా చూసుకుంటాడు. అయితే, అతను పరారీలో ఉన్నాడు.
మరో సంఘటనలో ఫెయిర్‌ల్యాండ్ ప్రాంతంలో అర్థనగ్నంగా బిచ్చగత్తె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇద్దరు మహిళలను కూడా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశారని పోలీసులు అంటున్నారు. వారిని ర్యాగ్ పికర్, బెగ్గర్లుగా స్థానికులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి, మృతుల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications