Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ఎన్నికల చోరీకి ఎన్నికల కమిషన్ సహకరించింది.. ఆధారాలు ఉన్నాయి"

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఎన్నికల చోరీకి ఈసీ సహకరిస్తోందని అన్నారు. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో ఈసీ నిర్వాకం బయటపడిందని.. త్వరలోనే ప్రజల ముందుకు ఆధారాలు ఉంచుతామని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ ప్యానెల్ సభ్యులు తప్పించుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ తన పనిని తాను చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

బిహార్ లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది. అయితే ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని.. కర్ణాటకలో ఎన్నికల సమయంలోనూ ఓట్ల చోరీ జరిగిందని త్వరలోనే ఆ వివరాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఎన్నికలు చోరీ చేసి ఎన్డీఏ కూటమి గెలిచేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అలాగే కేంద్రం ఎన్నికలను చోరీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని అన్నారు.

మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో అధికార బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉన్న లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆర్జేడీ అగ్రనేత, బీహార్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. టర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం వెనక్కి తగ్గకపోతే తాము బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాల్సి వస్తుందని తేజస్వి యాదవ్ హెచ్చరించారు.

ఇదే విషయంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో ఓట్లను చోరీ చేసేందుకు ఈసీ సాయం చేసిందని.. తమ దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఒక్క నియోజకవర్గం ఆధారాలు మాత్రమేనని.. అనేక నియోజకవర్గాల్లో ఇదే కుట్ర జరిగిందని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో వేల మంది వ్యతిరేకులను తొలగించారని మండిపడ్డారు. ఈసీ కానీ అందులోని అధికారులు కానీ ఈ నేరం నుంచి బయటపడాలని చూస్తున్నారు. కానీ అది జరగదు.. మీ బాగోతం మొత్తం దేశ ప్రజల ముందు పెడతాం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi Accuses EC of Aiding Central Govt in Election Fraud Promises Karnataka Evidence

ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల చోరీ జరుగుతోందని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో కోటి మంది కొత్త ఓటర్లను కలిపారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి కుట్ర తమకు తెలిసిపోవడంతో తాజాగా బిహార్ కు ప్లాన్ మార్చారని అన్నారు. అక్కడ 52 లక్షల ఓటర్లను తొలగించి కొత్త జాబితా తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+