రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రియాంక, రాబర్ట్ వాద్రా, రైహన్ వాద్రా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో తాజాగా, గురువారం రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమారుడు రైహన్ వాద్రాలు పాల్గొని ఆయనతోపాటు కదం కలిపారు. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నుంచి యాత్ర సాగుతోంది. మనం కలిసి నడిస్తే మన అడుగులు బలంగా ఉంటాయి అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రియాంకతోపాటు కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్ , సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్ యాత్రలో పాల్గొన్నారు.

Rahul Gandhi Bharat Jodo Yatra In MP: Priyanka Gandhi, Her Husband Robert Vadra Join Congress March

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 380 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను తన యాత్రలో కలుస్తుండటం తనకు సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలను చుట్టేశారు. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ఈ యాత్ర ప్రారంభమైంది.

ఇటీవల మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్హాన్పూర్, ఖండ్వా, ఖర్గోన్, ఇండోర్, ఉజ్జయినీ, అగర్ మల్వాలలో రాహుల్ యాత్ర కొసాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+