మోడీ మాస్టర్ స్ట్రోక్ తో ప్రతిఇంటా నిరుద్యోగం: ఇదే నవభారత్ నినాదం: రాహుల్ గాంధీ

దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బిజెపి సర్కారు ఇప్పటివరకు యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమైందని ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది. తాజాగా దేశంలోని నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.

 మోడీ మాస్టర్ స్ట్రోక్ కారణంగా 45 కోట్ల మందికి పైగా నిరుద్యోగుల్లో నిరాశ

మోడీ మాస్టర్ స్ట్రోక్ కారణంగా 45 కోట్ల మందికి పైగా నిరుద్యోగుల్లో నిరాశ

ప్రధాని నరేంద్ర మోడీ "మాస్టర్ స్ట్రోక్" కారణంగా 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉద్యోగం పొందాలనే ఆశ కోల్పోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 75 ఏళ్లలో అలా చేసిన మొదటి ప్రధాని మోదీ అని ఆయన మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. "నవ భారతదేశం యొక్క కొత్త నినాదం -- 'హర్ ఘర్ బేరోజ్‌గారీ అని ఆయన విమర్శించారు.

గత ఐదేళ్లలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు: రాహుల్ గాంధీ

గత ఐదేళ్లలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు: రాహుల్ గాంధీ

ఇంటింటా నిరుద్యోగం ఇదే ఇప్పటి నినాదం అంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మోడీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. ప్రతి ఇంట్లో నిరుద్యోగం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 45 కోట్ల మంది ఉద్యోగాల కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను కూడా ఆయన ఉదహరించారు. నిరుద్యోగ యువత తీవ్ర నిరాశా నిస్పృహలలో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

 సీబీఎస్ఈ సిలబస్ సవరణపై మండిపడిన రాహుల్ గాంధీ

సీబీఎస్ఈ సిలబస్ సవరణపై మండిపడిన రాహుల్ గాంధీ

ఇదిలా ఉంటే ఇటీవల రాహుల్ గాంధీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)పై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఇది 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యుకేషన్' అని అన్నారు. సీబీఎస్ఈ బోర్డ్ 10 మరియు 12 తరగతుల సిలబస్‌ను సవరించిన కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిలబస్‌ను సవరించడంపై రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

సీబీఎస్ఈ సిలబస్ నుండి ఆ పాఠాల తొలగింపుపై రాహుల్ గాంధీ ఫైర్

సీబీఎస్ఈ సిలబస్ నుండి ఆ పాఠాల తొలగింపుపై రాహుల్ గాంధీ ఫైర్

సీబీఎస్ఈ సిలబస్ లో ఆఫ్రో-ఆసియన్ భూభాగాలలో ఇస్లామిక్ సామ్రాజ్యాల పెరుగుదల, మొఘల్ కోర్టుల చరిత్రలు, ప్రచ్ఛన్న యుద్ధం మరియు పారిశ్రామిక విప్లవం గురించిన అధ్యాయాలను 11 మరియు 12 తరగతుల చరిత్ర మరియు రాజకీయ శాస్త్ర సిలబస్ నుండి తొలగించడం పట్ల రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 9న ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ 'రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఉన్న సంస్థలను రక్షించాలి' అని ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశంలో నిరుద్యోగ సమస్యపై మోడీ టార్గెట్ గా రాహుల్ విమర్శలు

దేశంలో నిరుద్యోగ సమస్యపై మోడీ టార్గెట్ గా రాహుల్ విమర్శలు

గతంలోనూ అనేకమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన స్నేహితులు భారతదేశ ఉపాధి వెన్నెముకను విరగ్గొట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాబోయే కాలంలో ఈ దేశంలోని యువతకు ఉపాధి దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014లో చెప్పారని, ఎంత మందికి ఉపాధి కల్పించారని రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+