సచిన్ గురించి ఆచి తూచి కామెంట్ చేయండి, నోరు జారొద్దు, కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఆదేశాలు
రాజస్తాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హై కమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సాప్ట్ కార్నర్‌తో ఉన్నారు. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆడియో టేపులు బయటకి రావడంతో.. వారిద్దరీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. కానీ సచిన్ పైలట్‌పై మాత్రం మెతక వైఖరి అవలంభిస్తున్నారు. ఇందుకు కారణం రాహుల్ గాంధీ అని తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటుకు సంబంధించి మీడియాతో మాట్లాడే ముందు రణదీప్ సుర్జేవాలకు రాహుల్ గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. సచిన్ పైలట్ పేరు ప్రస్తావించొద్దని, నెగిటివ్ వెళ్తుందని చెప్పడంతో మిగతా ఇద్దరు నేతలపై మాత్రం అనర్హత వేటు వేశారు.
అంతకుముందే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవీ నుంచి పైలట్‌నుతప్పించిన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేశామని, సచిన్‌ను కాదని సుర్జేవాలా స్పష్టంచేశారు. కానీ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌పై మాత్రం వేటు వేశారు. సచిన్.. రాహుల్ సన్నిహితుడు కావడంతో.. అతనిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఆచి తూచి స్పందిస్తోంది.

గురువారం రాత్రి మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా పైలట్‌తో మాట్లాడారు. ప్రియాంక గాంధీ విడతలవారీగా మంతనాలు జరుపుతున్నారు. కానీ పైలట్ మాత్రం అటు బీజేపీలోకి వెళ్లనని చెప్పారే గానీ. కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తానని ప్రకటించలేదు. కానీ హస్తం పార్టీ మాత్రం ఆయన రాక కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తోంది.
Recommended Video
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications