"మీకెంత ధైర్యం ?"- విద్యార్దులపై యూనివర్శిటీల ఆంక్షలపై రాహుల్ ఫైర్..!
ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపడుతున్న నిరసనలకు దేశవ్యాప్తంగా విద్యార్దుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ ఆందోళనల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత, విద్యార్ధులు స్వచ్చందంగా, భారీగా తరలివచ్చి పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసుల దెబ్బలకు కూడా వారు వెరవడం లేదు. అలాగే వివిధ రాష్ట్రాల్లోని యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంల విద్యార్ధులు కూడా సోషల్ మీడియాలో కాక్రోచ్ ల వీడియోల్ని షేర్ చేస్తున్నారు. దీంతో ఆయా సంస్ధలు విద్యార్దులపై ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు.
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనతో సహా చట్టవిరుద్ధమైన సమావేశాలకు దూరంగా ఉండాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం తాజాగా విద్యార్దులకు సోషల్ మీడియాలో అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించడానికి మీకెంత ధైర్యం అని గాంధీ ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టులో ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని గుర్తుచేశారు. దయచేసి గమనించండి, సమయం వచ్చినప్పుడు జవాబుదారీగా ఉండవలసింది మీరే అని యూనివర్శిటీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

How dare you threaten students for exercising their democratic rights?
— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2026
Please note, you are the ones that will be held accountable when the time comes. https://t.co/Mx6D19SP5h
ఇప్పటికే ఐఐటీ రూర్కీతో పాటు ఐఐటీ మద్రాస్ కూడా తమ విద్యార్దులకు జంతర్ మంతర్ ఆందోళనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, వీడియోలు తీసేయాలని కోరాయి. వీటిపై విమర్శలు రావడంతో ఇది తమ సాధారణ నిబంధనల్లో భాగంగా జారీ చేసే ఉత్తర్వులు మాత్రమేనని సమర్ధించుకున్నాయి. అయినా వీటిపై విమర్శల జడి వాన ఆగడం లేదు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా విద్యార్ధులపై ఆంక్షలు విధిస్తున్న యూనివర్శిటీల తీరుపై మండిపడుతూ ఈ ట్వీట్ చేశారు.
Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026
Don’t insult their intelligence with this pathetic midnight video.
1. Sack Pradhan.
2. Punish those who beat students.
3. Apologise https://t.co/7SLB6pQqZx
మరోవైపు ప్రధాని మోడీ అర్ధరాత్రి రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. 'అర్ధరాత్రి తీసిన ఈ దయనీయమైన వీడియోతో విద్యార్థుల తెలివిని అవమానించవద్దు అంటూ మోదీని రాహుల్ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి, విద్యార్థులను కొట్టిన వారిని శిక్షించండి, క్షమాపణ చెప్పండి అంటూ రాహుల్ ప్రధానికి సూచించారు.












Click it and Unblock the Notifications