భారత్-పాకిస్తాన్ చర్చలు సాధ్యమే.. కానీ.. తేల్చేసిన రాహుల్ గాంధీ..!

భారత్-పాకిస్తాన్ మధ్య స్వాతంత్రం తర్వాత నుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి. మధ్యలో కొన్ని యుద్దాలు, కొన్ని చర్చలు జరిగినా ఈ రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి అవి బాటలు వేయలేకపోయాయి. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్-పాక్ పరస్పరం ద్వేషించుకోవడం మాని కలిసి పనిచేయగలవా అంటూ ఓ పాకిస్తాన్ విద్యార్ధి అమెరికాలో లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రశ్నించాడు. దీంతో ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

PM Modi:
PM Modi:

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ..చికాగో యూనివర్సిటీలో నిర్వహించిన ఓ చర్చాగోష్టిలో విదేశీ విద్యార్ధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఓ పాక్ విద్యార్ధి.. భారత్-పాకిస్తాన్ పరస్పరం ద్వేషించుకోవడం మాని, భవిష్యత్తులో కలిసి పనిచేయలేవా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ స్పందించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు చర్చలు పునఃప్రారంభం కాలేవని ఆయన తేల్చిచెప్పేశారు. ఇరుదేశాల మధ్య సంప్రదింపులకు ఆస్కారం ఉందని, అయితే ఉగ్రవాదం అధిగమించలేని అడ్డంకిగా మిగిలిపోయిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Rahul Gandhi on Pakistan Dialogue Possible Only After Islamabad Ends Support for Terrorism
PF చందాదారులకు భారీ గుడ్ న్యూస్- విత్ డ్రా విధానంలో కీలక మార్పులు..!
PF చందాదారులకు భారీ గుడ్ న్యూస్- విత్ డ్రా విధానంలో కీలక మార్పులు..!

చర్చలకు అవకాశం ఉంది, కానీ ఒక పెద్ద సమస్య ఉంది, అదే మా దేశంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం. పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతున్నప్పుడు మా అమాయక ప్రజలు చంపబడుతున్న పరిస్థితిని అంగీకరించడం అసాధ్యం. కాబట్టి, అది ఆగిపోయిన క్షణమే, చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రస్తావన వచ్చినప్పుడు స్పందిస్తూ.. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించే భారత హక్కును రాహుల్ గాంధీ సమర్థించారు. రక్షణ సహకారంతో సహా ఇజ్రాయెల్‌తో భారతదేశం మంచి సంబంధాలను కొనసాగించాలని, అయితే దాని అంతర్జాతీయ వైఖరులు ఇతర దేశాల ప్రయోజనాల కంటే దాని స్వంత ప్రయోజనాల ద్వారా నిర్దేశించబడాలని ఆయన వాదించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ కంటే భారత్ పెద్ద దేశమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+