అధికారంలోకి రాగానే రెండు గంటల్లో కులగణన-రాహుల్ గాంధీ సంచలన హామీ..

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ లోపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కుల గణనకు మద్దతుగా ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే కుల సర్వే చేపడతామి ఇండియా కూటమి పార్టీలు హామీ ఇస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాము అధికారంలోకి రాగానే రెండు గంటల్లో కుల గణన చేపడతామన్నారు.

ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తమ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే రెండు గంటల్లో కుల గణనను నిర్వహిస్తుందని ప్రకటించారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కూడా గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఒక్కరికీ కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు.

rahul gandhi promises caste census within two hours after coming to power

రాష్ట్రంలో 2018లో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ చేసిన మూడు పెద్ద వాగ్దానాలు, అలాగే ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని ఎలా నెరవేర్చారో ఓటర్లకు గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ ఇవాళ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బియ్యం సేకరణ గురించి మాట్లాడుతూ రేపు ఇది కాంగ్రెస్‌కు పెద్ద విజయంగా మారుతుందన్నారు. కుల గణనతో పాటు పేద, వెనుకబడిన ప్రజల కంటే పారిశ్రామికవేత్తలకు కేంద్రం సహాయం చేయడాన్ని రాహుల్ గాంధీ ఇవాళ టార్గెట్ చేశారు.

ఏ ప్రభుత్వమైనా రెండు విధాలుగా పనిచేస్తుందని, అందులో ఒక మార్గం రాష్ట్రంలోని ధనవంతులకు సహాయం చేయడం , రెండవది రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడం అన్నారు. పేదలు, కూలీలు, రైతులు, నిరుద్యోగులు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారికి తాము సహాయం చేస్తున్నామని రాహుల్ తెలిపారు. వారి ప్రభుత్వం పెద్ద హామీలు ఇచ్చి చివరికి అదానీ జీకి సహాయం చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+