వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ వాయనాడ్ ఆఫీస్‌ ధ్వంసం, సిబ్బందిపై దాడి: ఎస్ఎఫ్ఐ గూండాలంటూ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

వాయనాడ్: కేరళ రాష్ట్రంలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికారిక కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు కేరళ పోలీసులు శుక్రవారం తెలిపారు. వందమందికిపైగా ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ దాడిలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

"ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నాయకుల బృందం వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంలోకి చొరబడి ధ్వంసం చేశారు. వారు కార్యాలయ సిబ్బందిపై, రాహుల్ గాంధీ సిబ్బందిపై కిరాతకంగా దాడి చేశారు. కారణం మాకు తెలియదు' అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐకి తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వేణుగోపాల్ ఆరోపించారు.

Rahul Gandhis office in Wayanad vandalised; Congress alleges involvement of SFI goons

' ఈ దాడి పోలీసుల సమక్షంలో జరిగింది. ఇది సీపీఎం నాయకత్వం చేసిన స్పష్టమైన కుట్ర. గత 5 రోజులుగా, ఈడీ రాహుల్‌ను ప్రశ్నిస్తోంది. కేరళ సీపీఎం.. నరేంద్ర మోడీ దారిలో ఎందుకు వెళుతుందో నాకు తెలియదు. సీతారాం ఏచూరి అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను' అని కేసీ వేణుగోపాల్ అన్నారు.

రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయంపై దాడికి సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను ట్యాగ్ చేస్తూ థరూర్ "రాజకీయాల గురించి వారి ఆలోచన ఇదేనా?" అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయం గోడ ఎక్కి ధ్వంసం చేసిన గూండాలు ఎస్‌ఎఫ్‌ఐ జెండాలను పట్టుకున్నారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) ఒక ట్వీట్‌లో ఆరోపించింది. కాగా, వాయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని కేరళ సీఎం పినరయి విజయన్ ఖండించారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

'మన దేశంలో, ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వెల్లడించడానికి, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అయితే, అది అతీగతీకి దారితీయకూడదు. ఇది తప్పుడు ధోరణి. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాము' అని కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ ఉత్తర కేరళలోని కొండ జిల్లా వాయనాడ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

రాహుల్ గాందీ వాయనాడ్ కార్యాలయంపై దాడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడినవారిపై కేరళ సీఎం విజయన్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులను కాంగ్రెస్ సహించదని అన్నారు.

English summary
Rahul Gandhi's office in Wayanad vandalised; Congress alleges involvement of 'SFI goons'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X