ట్రంప్ వ్యాఖ్యల్ని సమర్ధించిన రాహుల్..! స్వపక్షం నుంచే విమర్శలు..!
భారత్ ను ఉద్దేశించి డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలతో కేంద్రం ఇరుకునపడింది. ఓవైపు భారతీయ వస్తువులపై 25 శాతం పన్నులు విధించడంతో పాటు అదనంగా జరిమానాలు కూడా విధిస్తున్నట్లు చేసిన ప్రకటనతో కేంద్రానికి షాక్ తగిలింది. అనంతరం రష్యా ఆయుధాలు, చమురు కొంటున్న భారత్ ను ఉద్దేశించి ఈ రెండు దేశాలవి చచ్చిన ఆర్ధిక వ్యవస్థలని, తన తాజా నిర్ణయంతో ఈ రెండు దేశాలూ మరింత దిగజారడం ఖాయమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి మరింత షాకిచ్చాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన విపక్ష నేత రాహుల్ గాంధీ.. అవి అక్షరాలా నిజమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై చర్చ కోరిన రాహుల్.. దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో బయటికి వచ్చి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు అక్షరాలా నిజమని, ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తప్ప అందరికీ ఈ విషయం తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు.

#WATCH | Delhi: On the US President Trump's dead economy remark, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "Yes, he is right, Everybody knows this except the Prime Minsiter and the Finance Minsiter. Everybody knows that the Indian economy is a dead economy. I am glad that… pic.twitter.com/n7UWXrgggW
— ANI (@ANI) July 31, 2025
ట్రంప్ వాస్తవం చెప్పినందుకు తనకు సంతోషంగా ఉందని, బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ మిత్రుడు అదానీ కోసం ఆర్ధిక వ్యవస్థను నిండా ముంచేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ కాంగ్రెస్ ఎంపీలే తప్పుబట్టారు. పార్టీ అసంతృప్త ఎంపీ శశిథరూర్ తో పాటు మరో ఎంపీ రాజీవ్ శుక్లా సైతం భారత ఆర్ధిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. భారత్-అమెరికా చర్చలు సవాలుతో కూడుకున్నవని, మనం అనేక దేశాలతో చర్చలు జరుపుతున్నామని శశిథరూర్ తెలిపారు.

#WATCH | Delhi | On trade negotiations between the US and India, Congress MP Shashi Tharoor says, "It is a challenging negotiation. We are negotiating with many countries. The US is not the only negotiation. We have ongoing negotiations with the EU, we already concluded a deal… pic.twitter.com/tl85WKiMjW
— ANI (@ANI) July 31, 2025
అమెరికా మాత్రమే చర్చలు జరపడం లేదన్నారు. ఈయూతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. బ్రిటన్ తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని, ఇతర దేశాలతో కూడా మాట్లాడుతున్నామని గుర్తుచేశారు. అమెరికాలో మనం పోటీ పడలేకపోతే, అమెరికా బయట మన మార్కెట్లను వైవిధ్యపర్చాల్సి రావచ్చన్నారు. అమెరికా డిమాండ్లు అసమంజసంగా ఉంటే మనం వేరే చోటికి వెళ్లాలన్నారు. అదే భారతదేశం యొక్క బలం అన్నారు.












Click it and Unblock the Notifications