హిందూత్వవాదులపై రాహుల్ ఫైర్-ద్రవ్యోల్బణం, బాధ, దుఃఖానికి కారణం వారే
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మరోసారి హిందూత్వవాదులపై రెచ్చిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పాత నియోజకవర్గం అమేథీకి వచ్చిన రాహుల్.. హిందూత్వవాదులపై ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో హిందూమతం వేరు, హిందూత్వ వేరని వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్.. ఇవాళ దాన్ని పతాకస్ధాయికి తీసుకెళ్లారు.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బాధ, దుఃఖానికి 'హిందుత్వవాదులే ప్రత్యక్ష కారణమని రాహుల్ గాంధీ ఇవాళ వ్యాఖ్యానించారు. అమేథీలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని తన మాజీ కంచుకోట అమేథీలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "ఈ రోజు, మన దేశంలో మెహంగై (ద్రవ్యోల్బణం), బాధ, విచారం ఉందంటే అది హిందుత్వవాదుల వల్లేనని వ్యాఖ్యానించారు. ఈరోజు హిందువులకు, హిందుత్వవాదులకు మధ్య యుద్ధం జరుగుతోంది. హిందువులు సత్యాగ్రహాన్ని విశ్వసిస్తే, హిందూత్వవాదులు 'సత్తాగ్రహ' (రాజకీయ దురాశ)ను విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈరోజు అమేథీలో 6 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ 2.5 ఏళ్ల తర్వాత అమేథీకి వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని గంగా నదిలో స్నానం చేస్తున్నా... నిరుద్యోగం వంటి సమస్యలపై మాత్రం నోరు మెదపడం లేదన్నారు. "ఈ రోజు దేశంలో ప్రజలు ఎందుకు ఉపాధి పొందలేకపోతున్నారు? ద్రవ్యోల్బణం ఎందుకు అంత త్వరగా పెరుగుతోంది?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్‌లో బిజీగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవాళ లడఖ్‌లో చైనా భారత్‌కు చెందిన భూమిని లాక్కొని దాన్ని తన సొంతం చేసుకుంది. కానీ ప్రధాని ఏమీ మాట్లాడలేదు. భూమి తీసుకోలేదని ప్రధాని చెప్పారు. కొంతకాలం తర్వాత, రక్షణ మంత్రిత్వ శాఖ భూమిని తీసుకున్నట్లు చెప్పిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications