Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"Available Now": మాజీ ఆర్మీ ఛీఫ్ బుక్ పై రాహుల్ మరో షాక్-పెంగ్విన్ విలవిల..!

మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకంలోని అంశాల్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాత బయటికి వచ్చి ఆ బుక్ ను నేరుగా ప్రదర్శించి విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) షాకిచ్చారు. దీంతో ఇప్పటికే ఈ పుస్తకం ప్రచురణ హక్కులు పొందిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (పీఆర్ హెచ్ఐ) బుక్కయింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పెంగ్విన్ తాము ఈ ప్రచురించని పుస్తకంలో అంశాల్ని ఎవరైనా బయటపెడితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ పై కేసు పెట్టారు.

ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ పుస్తకం వివాదంపై స్పందించారు. మాజీ ఆర్మీఛీఫ్ రాసిన పుస్తకంలోని అంశాల్ని, అసలు ఆ పుస్తకాన్ని బయటపెట్టిన తర్వాత నెలకున్న వివాదంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పెంగ్విన్, నరవణేల్లో ఎవరు కరెక్ట్ అని ప్రశ్నించారు. అంతే కాదు నరవణేను నమ్ముతారా పెంగ్విన్ ను నమ్ముతారా అని కూడా సూటి ప్రశ్న వేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక అంతా తికమక పడాల్సిన పరిస్ధితి.

Rahul Gandhi Uses Naravane s 2023 Available Now Post to Undercut Publisher s Memoir Claim

మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే తాము గతంలో కరోనా సమయంలో చైనాతో యుద్దం చేస్తున్నప్పుడు, ప్రత్యర్థి సైనికులు, యుద్ధ ట్యాంకులు మన సరిహద్దుల వరకూ వచ్చిన విషయాన్ని తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని ఈ బుక్ లో రాసినట్లు రాహుల్ గాంధీ గతంలో తెలిపారు. దీంతో ఈ పుస్తకం కాస్తా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్మీ ఈ పుస్తకం రిలీజ్ కు అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది. కేంద్రం కూడా ప్రచురించని పుస్తకాన్ని తీసుకొచ్చి ఏంటీ రచ్చ అని రాహుల్ ను పార్లమెంట్ లో అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పెంగ్విన్ స్పందించడం, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడంపై స్పందించిన రాహుల్.. గతంలోనే ఈ పుస్తకం 2023లోనే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని నరవణే పెట్టిన ట్వీట్ ను అందరికీ చూపించారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+