ఈసారి హైడ్రోజన్ బాంబ్..! మోడీ మొహం చాటేస్తారు- రాహుల్ మరో సంచలనం..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఓట్ల చౌర్యం జరుగుతోందని, వీటిని అడ్డుపెట్టుకుని బీజేపీ వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ప్రకటన చేశారు. గతంలో కర్నాటక, మహారాష్ట్రలోని రెండు సీట్లలో ఓట్లు ఎలా తొలగించారో, ఎలా కొత్త ఓట్లు చేర్చారో ఆధారాలతో సహా బయటపెట్టిన రాహుల్.. ఇప్పుడు దాన్ని మించిన హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నట్లు ఇవాళ బీహార్ లో ప్రకటించారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

బీహార్ లో 65 లక్షల ఓట్లను ఈసీ తొలగించడాన్ని తప్పుబడుతూ ఓటర్ అధికార్ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఓటరు జాబితాల్లో అక్రమాలపై త్వరలో కాంగ్రెస్ పార్టీ మరో బాంబు పేల్చబోతోందని రాహుల్ ప్రకటించారు. ఇప్పటికే ఓట్ల చోరీపై అణుబాంబు పేల్చామని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే విషయం చర్చించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు దాన్ని మించి హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నట్లు రాహుల్ ప్రకటించారు.

Rahul Gandhi Warns of Vote Chori Hydrogen Bomb Expos modi won t show face BJP Reacts Strongly

బీజేపీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్.. మీరెప్పుడైనా అణుబాంబుకు మించినది ఏదైనా చూశారా అని ప్రశ్నించారు. అది హైడ్రోజన్ బాంబు అని, దానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. అతి త్వరలో హైడ్రోజన్ బాంబు పడబోతోందన్నారు. దీంతో ఓట్ల చోరీపై మరిన్ని నిజాలు బయటికి రాబోతున్నాయన్నారు. హైడ్రోజన్ బాంబు పడగానే నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మొహం చూపించలేరన్నారు.

Rahul Gandhi Warns of Vote Chori Hydrogen Bomb Expos modi won t show face BJP Reacts Strongly

తాను ఇక్కడ ఓట్ చోర్-గద్దే ఛోడ్ (ఓట్ల దొంగ- గద్దె దిగు) నినాదం ఇచ్చానని, ప్రజలు దాన్ని అందుకున్నారని రాహుల్ తెలిపారు. ఈ నినాదం ఇప్పుడు చైనాలో కూడా వినిపిస్తోందన్నారు. అమెరికాలో వినిపిస్తోందని అక్కడి ప్రజలు చెప్తున్నారన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. ఆయన చేసిన "బాంబులు" అని పిలవబడే వాటిని కేవలం మూర్ఖత్వంగా కొట్టిపారేసింది. కాంగ్రెస్ నాయకుడు తన ఆరోపణలు నిజమైతే ఎన్నికల కమిషన్ కోరిన అఫిడవిట్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+