నేను తప్పు చేయలేదు: జడ్జితో రాహుల్ గాంధీ
భివాండి : మహాత్మ గాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందంటూ 2014 ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త మహారాష్ట్రలోని భివాండి కోర్టులో పరువునష్టం కేసు వేశాడు. ఈ కేసు విచారణ కోసం రాహుల్ గాంధీ స్వయంగా భివాండీ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల మధ్య రాహుల్ గాంధీ కోర్టుకు చేరుకున్నారు.
కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి అల్ షేఖ్ నిజంగా తప్పు చేశావా అని రాహుల్ ను ప్రశ్నించగా... ఇందుకు సమాధానంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రాహుల్ చెప్పారు. 2014లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంతే 2016లో భివాండీ కోర్టులో పరువునష్ట దావా వేశారు. అయితే అప్పుడే రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది.

2016లో తనపై నమోదైన పరువు నష్ట దావా కేసును కొట్టివేయాల్సిందిగా రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయంచాడు. ఆ తర్వాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని తను విచారణ ఎదుర్కొంటానంటూ తెలిపారు. తను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని... తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు చెప్పిన రాహుల్ ... విచారణ ఎదుర్కొంటానని తెగేసి చెప్పారు.












Click it and Unblock the Notifications