యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారం
మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయకచర్యలు చేపట్టగా, ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. వారిలో 4ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా శిధిలాల కిందే పలువురు చిక్కుకొని ఉండటంతో రెస్క్యూ కొనసాగుతున్నది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నాణ్యత లోపం వల్లే కూలిందా?
బిల్డింగ్ దుర్ఘటనలకు కేరాఫ్ గా ఉన్న మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. భవంతి ఒక్కసారిగా కుప్పకూలడంతో వందలమంది శిధిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే ఎన్టీఆర్ఎఫ్, రాష్ట్ర అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి వెళ్లి రెస్క్యూ చేపట్టారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే భరత్ గోగావాలె, జిల్లా కలెక్టర్ నిధి చౌదరి అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఆ బిల్డింగ్ పాతదేమీ కాదని, నిర్మించి పదేళ్లు కూడా కాలేదని వెల్లడైంది. నాణ్యతా లోపం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గంట గంటకూ పెరుగుతోన్న మరణాలు..
సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో, దాదాపు 45 కుటుంబాలూ తమ పోర్షన్లలో ఉన్న సమయంలోనే బిల్డింగ్ కూలిపోవడంతో వందల మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. గడిచిన 24 గంటలుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంట గంటకూ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తాజాగా ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. రాత్రి 8:30 వరకు మొత్తం 13 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా పదుల సంఖ్యలో జనం శిధిలాల కిందే ఉండొచ్చని అధికారులు చెప్పారు.

యముణ్ని ఎదురించిన బుడతడు..
మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు నిన్నటి నుంచి సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. మంగళవారం సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఓ నాలుగేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. దాదాపు 20 గంటలపాటు శిథిలాల్లో ఉండిపోయిన బాలుడు సురక్షితంగా బయటపడటంతో అక్కడి జనం కేరింతలు కొట్టారు. యముణ్ని ఎదురించిన బాలుడంటూ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ బాలుడితోపాటు మరో చిన్నారిని కూడా కాపాడామని అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ అంచనా మేరకు మరో 17 మంది శిథిలాల కింద ఉండి ఉండొచ్చని, సాధ్యమైనంత తొందరగా వాళ్లను బయటికి తీస్తామని రెస్క్యూ బృందాల ప్రతినిధులు తెలిపారు.
Recommended Video

మహద్ దుర్ఘటనపై మోదీ విచారం..
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ లో బిల్డింగ్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. ఘటనలో చిక్కుకున్న కుటుంబాలు ఎంతగా నష్టపోయాయో తనకు తెలుసన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు. అంతకుముందు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం బిల్డింగ్ కూలిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications