Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎటూ వెళ్లని రైలు!: ఛార్జీలు పెంచలేదు, భద్రతకి పీట, కొత్త రైళ్లు నో

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ రైల్వే బడ్జెట్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఇది తొలి రైల్వే బడ్జెట్.

రైల్వేలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని సురేష్ ప్రభు అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రైల్వే అభివృద్ధిపై మోడీ దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు.

అంచనాల భారం రైల్వేలపై ఎక్కువగా ఉందని అన్నారు. రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఆయన అన్నారు. ఆధునిక భారతంలో రైల్వేల అభివృద్ధే కీలకమని మంత్రి అన్నారు. రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి విపరీతంగా పెరిగిందని అన్నారు. రైల్వేలు భారతీయ జీవన విధానానికి ప్రతిీక అని గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
రైల్వే మంత్రి ఈ బడ్జెట్‌లో ఒక్క కొత్త రైలు ప్రవేశ పెట్టలేదు. రైల్వే బడ్జెట్ పైన విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

 Railway Budget 2015 (Live): Budget will be good: Suresh Prabhu

రైల్వే బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా ఉందని సురష్ ప్రభు అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వే బడ్జెట్ తయారు చేశామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశామని చెప్పారు. అన్ని వర్గాలను, ప్రాంతాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్నారు.

పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేస్తామన్నారు.
బడ్జెట్‌లో కొత్తగా ఏదీ కనిపించలేదని మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు.

సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట ముందు చూపుతో, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

భారతీయ రైల్వేలు కలకాలం ఉండాలంటే పెట్టుబడులు అవసరం
రైళ్లలో పెట్టుబడులు పెడితే పర్యావరణాన్ని కాపాడినట్లే

గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం
9 కారిడార్లలో రైళ్ల స్పీడ్ పెంపు
మెట్రో నగరాల మధ్య వేగవంతమైన రైళ్లు
రైల్వేల భూముల కబ్జా నివారణకు డిజిటల్ మ్యాపింగ్
కోచ్ లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తాం
సిగ్నలింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం
యంత్రాల సాయంతో ట్రాక్ మెయింటెనెన్స్
రాష్ట్రాల భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం
రైల్వేలలో అవినీతి సహించం
ఓడరేవులతో కనెక్టివిటికీ రూ.2వేల కోట్లు
రైళ్ల వేగం తగినంత పెరిగితే అబివృద్ధి సాధ్యం
గతేడాది కంటే 84 శాతం పెట్టుబడులు పెంపు
మరిన్ని ఆటోమేటిక్ మిషన్లు
రైల్వేల ఉత్పాదక రంగాలకు ప్రయివేటు పెట్టుబడులు
స్పీడ్ రైళ్లపై నివేదిక రాగానే పలు పనులు మొదలు

రైల్వే భద్రతకు 6,581 కోట్లు
ప్రమాదాల నివారణకు ఇస్రో సాయంతో ప్రత్యేక డిజైన్
త్వరలో 970 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
విదేశీ రైల్వే టెక్నాలజీ తీసుకు వస్తాం
ఢిల్లీ - కోల్ కతా, ఢిల్లీ - ముంబై మధ్య ఓవర్ నైట్ రైల్వేలు
రానున్న అయిదేళ్లలో భారతీయ రైల్వేలో గణనీయ మార్పులు
గేజ్ మార్పిడీలకు ర.96వేల కోట్లు కేటాయింపు
ప్రయివేటు పెట్టుబడుల కోసం నిబంధనలు సరళతరం
రైల్వేలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత
మేకిన్ ఇండియాలో ఉద్యోగ కల్పన

స్టీల్, బొగ్గు రవాణాకు కొత్త లైన్ల నిర్మాణం.
ఈశాన్య రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీ కనెక్టివిటీ
రైల్వేలో పీపీపీ విధానం
రైల్వేలైన్ల విద్యుధీకరణకు 130 శాతం నిధుల పెంపు
67 శాతం నిధులు ప్రయాణీకుల కోసమే ఖర్చు
రైల్వేల అభివృద్ధికి ఓపెన్ బిడ్స్ ఆహ్వానిస్తాం
రైల్ ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి 60 రోజుల్లో అనుమతి
400 స్టేషన్లలో వైఫై
రైళ్లలో శాకాహారులకు ప్రత్యేక వంటలు
అవకాశాన్ని బట్టి డబుల్ రైల్ ట్రాక్ ల నిర్మాణం
4 రైల్వే రీసెర్చ్ కేంద్రాలు
మేఘాలయను రైల్వే ట్రాక్ తో అనుసంధానం చేస్తాం

రద్దీ రూట్లలో జనరల్ బోగీలు పెంపు.
ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ
61 మార్గాల్లో రైల్ కమ్ రోడ్డు టిక్కెట్లు
రానున్న ఐదేళ్లలో రైల్వేలోకి రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
బ్యాంకు నిల్వలు, పెన్షన్ ఫండ్‌ను అభివృద్ధికి ఉపయోగించుకుంటాం
వనరుల సమీకరణకు సంస్థలతో చర్చలు
ఇంధన పొదుపుకు రైల్వల విద్యుదీకరణ
ముంబై -అహ్మదాబాద్ స్పీడ్ రైలు పై నివేదిక
క్రాసింగుల వద్ద ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు
మనుషులు లేని క్రాసింగ్ వద్ద ఆధునిక యంత్రాలు
అంధులకు సౌకర్యవంతంగా ఉండేలా బోగీలు
కూరగాయలు, పచ్చి సరుకు, పండ్ల కోసం ప్రత్యేక ఏర్పాటు
రైళ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ

రైల్వే బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనం దిశగ సాగుతున్నాయి.
జనరల్ బోగీల్లోను సెల్ ఫోన్ చార్జింగ్ సదుపాయం

మహిళలకు, వృద్ధులకు లోయర్ బెర్తులు.
ప్రయాణీకుల సౌకర్యాలకు ఎంపీల నిధులు ఉపయోగించవచ్చు.
ముఖ్య నగరాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు
పాసింజర్ రైళ్ల రాకపోకల్లో కచ్చితమైన సమయం పాటిస్తాం
9400 కిలోమీటర్లలో గేజ్ మార్పిడి పనులు
వనరుల సమీకరణపై సంస్థలతో చర్చలు
జమ్మూ కాశ్మీర్ వరకు స్పీడ్ రైల్వే లైన్ల ఏర్పాటు

650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణం
టిక్కెట్లు కొనే కేంద్రాల వద్ద క్యూల నివారణకు చర్యలు
పేపర్ లెస్ టిక్కెట్‌ను విస్తృతం చేస్తాం
కేటగిరీ ఏ స్టేషన్లలో ఫ్రీగా వైఫై
శతాబ్ధి వంటి వాటిలో మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలు
వృద్ధులకు, పేషెంట్లకు మరిన్ని సౌకర్యాలు
ప్రయాణీకుల కోసం మార్చి 1 నుండి కొత్తగా 138 హెల్ప్ లైన్లు
108 రైళ్లలో ఈ కేటరింగ్ సదుపాయం
ఎంపీ ఫండ్స్ తో రైల్వేల అభివృద్ధి

120 రోజుల ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్లు
ప్రయాణీకుల సౌకర్యం కోసం అందరి సాయం తీసుకుంటాం
152 రైల్వే స్టేషన్లకు మోడ్రన్ రైల్వే స్టేషన్లుగా అప్ గ్రేడ్
అప్పర్ బెర్త్ లు మరింత సౌకర్యవంతంగా చేస్తాం
రైళ్ల రాకపోకలు, ఆగే సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా అందిస్తాం
అన్ని స్టేషన్లలో టిక్కెట్లు అమ్మే కేంద్రాల ఏర్పాటు
భద్రతపై ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 182
డిమాండుకు అనుగుణంగా కోచ్ లు పెంచుతాం
మేజర్ స్టేషన్లలో లిఫ్టులు
స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ రైలు నినాదంతో ముందుకు పోతాం
రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు
కేటగిరీ బీ స్టేషన్లలో వైఫై సౌకర్యం
ప్రయణీకులకు అతి తక్కువ ధరకు తాగునీరు
కొన్ని రూట్లలో బుల్లెట్ రైళ్లు ప్రవేశ పెట్టే యోచన

ఫిర్యాదుల నమోదుకు మొబైల్ నెంబర్.

నిర్భయ ఫండ్ కింద మహిళలకు భద్రత
కొన్ని రైళ్ల కంపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు
మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు, కోచ్ లు ఏర్పాటు
రైళ్లలో వ్యాక్యూమ్ టాయిలెట్లు ప్రవేశపెడుతున్నాం
ప్రయాణీకుల సౌకర్యానికి పెద్దపీట
మిడిల్ బెర్త్ లు మహిళలు, వృద్ధులకు రాకుండా చూస్తాం

స్వచ్ఛ రైల్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

మెరుగైన సౌకర్యాలు అందిస్తాం
17వేల టాయిలెట్స్ ను బయో టాయిలెట్స్ గా మారుస్తాం
రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. సుపరిపాలన, పారదర్శకతకుపెద్దపీట, రైల్వేల ఆధునికీకరణ
ఛార్జీలు పెంచే ఆలోచనలేదు. యథాతథంగా కొనసాగుతాయి
రైల్వేల అభివృద్ధికి నాలుగు లక్ష్యాలు.. కనెక్టివిటీ పెంచడం, భద్రత, ఆర్థిక స్థిరత్వం,
భారతీయ రైల్వే పరిస్థితిని మార్చేలా ఈ బడ్జెట్ ఉంటుంది
శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు వేగం125 కిలోమీటర్లకు మించి వేగం పెంచలేమా
పాసింజర్ రైళ్ల వేగం గంటకు 25 కిలోమీటర్లకు మించి పెంచలేమా
పర్యావరణ హితమైన రైల్వే అభివృద్ధి లక్ష్యం
రైళ్లలో భద్రత, మౌలిక వ్యవస్థలకు ప్రాధన్యత.
ఇంత పెద్ద వ్యవస్థ, ఉద్యోగులతో సాధ్యం కనిది ఏముంటుంది.
కాలం చెల్లిన రైళ్లను నడపాల్సిన పరిస్థితి ఉంది.
ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది.
రాజధాని, శతాబ్ది రైళ్లు అనుకున్నంత నడవడంలేదు.
సురేష్ ప్రభు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

పార్లమెంటుకు చేరుకున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు

రైల్వే బడ్జెట్ బాగుంటుందని సురేష్ ప్రభు చెప్పారు. తద్వారా ఈసారీ ఛార్జీల పెంపు ఉండదని సంకేతాలి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఉదయం పదకొండున్నర గంటలకు రైల్ భవన్ నుండి పార్లమెంటుకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడతారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, రాజీవ్ ప్రతాప్ రూఢీ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే బడ్జెట్ ప్రతులను అదికారులు పార్లమెంటుకు తీసుసుకు వచ్చారు.

ఏం కోరుకుంటున్నారు?

ఆయిల్ రేట్స్ తగ్గిందున మంచి మౌలికసదుపాయాలు.
ఛార్జీలు యథాతధంగా ఉంచాలి.
ఎఫ్‌డీఐల పైన దృష్టి.
క్లీన్లీనెస్ డ్రైవ్స్
బుల్లెట్ ట్రైన్లు, ఏసీ రాక్స్ పైన ఆశలు
మేకిన్ ఇండియాలో రైల్వేలు
రైల్వేల్లో ఐటీ, వైఫై
భద్రత

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+