ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ irctc పోర్టల్ పైన కీలక అప్డేట్ ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థకు అంతరాయాన్ని కలిగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా దుర్వినియోగానికి పాల్పడుతున్న నకిలీ ఐడీలను గుర్తించిన కేంద్రం చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

irctcలో నకిలీ ఐడీలను తొలగించిన కేంద్రం

irctc ప్లాట్ ఫామ్ లో 3.03 కోట్ల నకిలీ ఐడీలను తొలగించినట్టు ఆయన వెల్లడించారు. ఈ చర్యల కారణంగా సాధారణ ప్రయాణికులకు టికెట్లు సులభంగా అందే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ దందాను అరికట్టడానికి ఈ చర్య కీలకంగా మారిందని పేర్కొన్నారు.

Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3 03 Crore Fake IDs benefits ordinary passengers

ఫేక్ అకౌంట్స్ పైన చర్యలు తీసుకున్నామన్న రైల్వే మంత్రి

రైల్వే దళారులు పెద్ద సంఖ్యలో నకిలీ ఖాతాలను ఉపయోగించి టికెట్లను బుక్ చేసి, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ క్రమంలో సామాన్య ప్రజలకు మేలు చేయడానికి ఆయా ఫేక్ అకౌంట్లో పైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఫేక్ అకౌంట్ల తొలగింపుతో బుకింగ్ వ్యవస్థ పారదర్శకంగా మారిందని, నిజమైన ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీలోనే

రైల్వే సేవల విస్తరణపై కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీలోనే ఉన్నాయని చెప్పారు. సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,000 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వెల్లడించారు.

irctc అతిపెద్ద ప్రక్షాళన

పండుగల సమయంలో, రద్దీ రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సరసమైన రవాణా సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తత్కాల్ మరియు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ టికెట్ల అమ్మకాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్ లు మరియు మోసపూరిత బుకింగ్ పద్ధతులపై విస్తృత చర్యలలో భాగంగా irctc అతిపెద్ద ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.

ప్రధానంగా ఈ అంశాలపైనే దృష్టి

టికెట్ బుకింగ్‌లో పారదర్శకత పెంచడం, దళారుల అక్రమాలను అరికట్టడం, మరియు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం వంటి అంశాలపై రైల్వే మంత్రి దృష్టి సారించినట్లు ఆయన తన వ్యాఖ్యలతో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+