బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rains: బెంగళూరు ప్రజలకు మళ్లీ బెంగ, దెబ్బకు మెట్రో గోడ ఢమాల్, కుమ్ముడే కుమ్ముడు, టెన్షన్ మొదలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు సిటీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ప్రజలకు 70 ఎంఎం సినిమా మొదలైయ్యింది. బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురవడం మొదలైయ్యింది. రాత్రి 8.30 గంటలకు మొదలైన భారీ వర్షం పలు ప్రాంతాల్లో అర్దరాత్రి దాటినా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కురిసింది. రాత్రి ఇళ్లకు వెళ్లడానికి బయలుదేరిన సామాన్య ప్రజలు భారీ వానలో చిక్కుకుని అర్దరాత్రి దాటినా ఇంటికి చేరుకోలేకపోయారు. ఓలా, ఉబర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఆటోలు, క్యాబ్ లు లేక సామాన్య ప్రజలు నానా తిప్పలుపడ్డారు. పలుప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు చోట్ల కాంపౌడ్ గొడలు కుప్పకూలిపోయాయి. బెంగళూరు మెట్రోరైలు ట్రాక్ సమీపంలో ఏర్పాటు చేసిన కాంపౌడ్ గొడవ కుప్పకూలిపోవడంతో కార్లు, బైక్ లు ద్వంసం అయ్యాయి. వాన దెబ్బకు మెట్రో రైలు కాంపౌండ్ పక్కన వాహనాలు నిలిపి సమీపంలోని భవనాల టెర్రాస్ ల కింద తలదాచుకున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.

Honour killing: కులపిచ్చి, మైనర్ కూతురు, బాయ్ ఫ్రెండ్ ను చంపేసి ?, కృష్ణా నదిలో కలిపేసి ?Honour killing: కులపిచ్చి, మైనర్ కూతురు, బాయ్ ఫ్రెండ్ ను చంపేసి ?, కృష్ణా నదిలో కలిపేసి ?

బెంగళూరులో మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది

బెంగళూరులో మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది

బెంగళూరు సిటీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ప్రజలకు మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది. బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురవడం మొదలైయ్యింది. రాత్రి 8.30 గంటలకు మొదలైన భారీ వర్షం పలు ప్రాంతాల్లో అర్దరాత్రి దాటినా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కురిసింది.

రోడ్లు జలమయం..... పాదచారులు ?

రోడ్లు జలమయం..... పాదచారులు ?

ఓలా, ఉబర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఆటోలు, క్యాబ్ లు లేక సామాన్య ప్రజలు నానా తిప్పలుపడ్డారు. బుధవారం రాత్రి ఇళ్లకు వెళ్లడానికి బయలుదేరిన సామాన్య ప్రజలు భారీ వానలో చిక్కుకుని అర్దరాత్రి దాటినా ఇంటికి చేరుకోలేకపోయారు. పలు ప్రాంతాల్లో రోడ్ల మీద మూడు అడుగులకుపైగా వర్షం నీరు నిలిచిపోవడంతో పాదచారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాన దేవుడు కుమ్ముడే కుమ్ముడు

వాన దేవుడు కుమ్ముడే కుమ్ముడు

పలు ప్రాంతాల్లో ఆటోలల్లోకి నీరు చేరిపోవడం, వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ప్రజలను నిలువుదోపిడీ చేశారు. మేము చెప్పి డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాము, లేదంటే మీ చావుమీరు చావండి అంటూ తేల్చి చెప్పారు.

మెట్రోరైలు కాంపౌండ్ గొడ కుప్పకూలిపోయింది

మెట్రోరైలు కాంపౌండ్ గొడ కుప్పకూలిపోయింది

బెంగళూరులోని పలుప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు చోట్ల కాంపౌడ్ గొడలు కుప్పకూలిపోయాయి. బెంగళూరు నగరంలోని శేషాధ్రిపురంలోని మెట్రోరైలు ట్రాక్ సమీపంలో ఏర్పాటు చేసిన కాంపౌడ్ గొడ కుప్పకూలిపోవడంతో కార్లు, బైక్ లు ద్వంసం కావడంతో ప్రజలు బిత్తరపోయారు.

మెట్రో అధికారులు పట్టించుకోలేదని ?

మెట్రో అధికారులు పట్టించుకోలేదని ?

వాన దెబ్బకు మెట్రో రైలు కాంపౌండ్ పక్కన వాహనాలు నిలిపి సమీపంలోని భవనాల టెర్రాస్ ల కింద తలదాచుకున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే గురువారం ఉదయం 11 గంటలు అయినా శేషాద్రిపురం మెట్రోరైలు ట్రాక్ దగ్గర కుప్పకూలిన కాంపౌండ్ గొడ దగ్గరకు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Rain: Heavy rain in Bengaluru parts of Namma Metro's retaining wall near Seshadripuram collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X