పన్నీర్ సెల్వం ఇంటిలోకి వరద నీరు: సీఎం ఇంటి రోడ్డులో ఐదు అడుగుల ఎత్తు నీరు, అంతే !

Posted By:
Subscribe to Oneindia Telugu
చెన్నైలో ఇళ్లలోకి వరద నీరు (Video) | Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటిలోకి శుక్రవారం వరదనీరు వెళ్లింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటిలోకి చేరిన వరద నీరును తొలగించడానికి గ్రేటర్ కార్పొరేషన్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నివాసం ఉంటున్న రోడ్డు జలమయం అయ్యింది.

ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటిలోకి వరద నీరు వెళ్లిన వెంటనే అధికారులు, సిబ్బంది స్పందించారని, మా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి.

 Rain water entered TN deputy CM Panneerselvam house in Chennai

బంగాళాఖాంతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా గురువారం రాత్రి చెన్నై నగరంలో ఏకదాటిగా ఐదు గంటలకు పైగా వర్షం పడటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా నాలుగు అడుగుల ఎత్తు నీరు నిలిచిపోవడంతో కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.

వరద నీటి దెబ్బ సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి తగిలింది. పన్నీర్ సెల్వం ఇంటిలో ఆయన కుటుంబ సభ్యులు మేడ మీదకు వెళ్లిపోయారు. గ్రేటర్ కార్పొరేషన్ సిబ్బంది పన్నీర్ సెల్వం ఇంటిలోని వర్షం నీటిని బయటకు పంపిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deputy Chief minister O. Paneerselvam house has been flooded. Rain water entered in OPS house. CM Edapadi palanisami house road also drained in flood.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి