పార్లమెంటుకొస్తే: టిపై రాజ్ హామీ, టిడిపిపై భిన్నస్వరాలు

పొత్తులపై భిన్నాభిప్రాయాలు
ఎన్నికల పొత్తులపై బిజెపిలో తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని కత్రియా హోటల్‌లో పార్టీ రాష్ట్ర పదాధికారులతో రాజ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులపై హాట్‌హాట్‌గా చర్చించారు.
టిడిపితో పొత్తు వద్దని కొంతమంది జూనియర్ నేతలు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు పొత్తులను విభేదించారు. పొత్తులపై పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనా రెడ్డి సానుకూలంగా మాట్లాడారు. పొత్తులు పెట్టుకుంటే ఫర్వాలేదని, కానీ టిడిపి, తెరాసలతో పొత్తులు పెట్టుకునే ముందు సీట్ షేరింగ్ వ్యవహారం తేల్చాలని అన్నారు.
ఈ సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ కల్పించుకుని ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని, పొత్తుల గురించి మాట్లాడే అవసరం వచ్చినప్పుడు, తప్పకుండా రాష్ట్ర పార్టీని సంప్రదిస్తామని అన్నారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలంటూ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు కంభంపాటి హరిబాబు తదితరులు రాజ్‌నాథ్ సింగ్‌కు 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.












Click it and Unblock the Notifications