వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం కంటే సల్మాన్‌తో స్నేహం ఎక్కువేం కాదు: రాజ్‌థాక్రే

|
Google Oneindia TeluguNews

థానే: పాకిస్థాన్ నటులు ఉగ్రవాదులు కాదంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే ఘాటుగా స్పందించారు. సల్మాన్‌ఖాన్‌తో స్నేహం దేశం కంటే ఎక్కువేమీ కాదని తేల్చి చెప్పారు. ఆ మాటకు వస్తే స్నేహం ఎప్పుడూ దేశం కంటే ఎక్కువకాదని స్పష్టం చేశారు.

ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన రాజ్‌థాక్రే మాట్లాడుతూ.. 'సల్మాన్‌ పాక్‌ నటులకు మద్దతుగా మాట్లాడినప్పుడు నేను స్పందించను అనుకున్నారు. కానీ, విషయం దేశం, ప్రభుత్వం వరకు వస్తే స్నేహితులు అని కూడా చూడం. అయినా సల్మాన్‌ఖాన్‌కు అక్కడ తన సినిమాలు బాగా ఆడతాయన్న విషయంపైనే ధ్యాస ఉంది' అని వ్యాఖ్యానించారు.

raj thackeray-salman khan

యూరీ దాడి నేపథ్యంలో పాక్‌ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న ఎంఎన్ఎస్ హెచ్చరికను బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌, శ్యామ్‌బెనగల్‌లు తప్పుపట్టారు. పాకిస్థానీ నటులను బహిష్కరించడం ఉగ్రవాదానికి పరిష్కారం కాదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సల్మాన్‌ మరో అడుగు ముందేకేసి 'పాక్‌ నటులు చట్టబద్ధమైన వీసాలు, వర్క్‌పర్మిట్లతోనే బాలీవుడ్‌లోకి వచ్చారు' అని వాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రాజ్ థాక్రే పై వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉండగా, 'ఎంఎస్ ధోనీ' చిత్రాన్ని పాకిస్థాన్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే.

English summary
Referring to his friendship with Bollywood superstar Salman Khan, MNS chief Raj Thackeray on Sunday said friendship was not above the state and country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X