సల్మాన్ ఖాన్ స్టుపిడ్ కావొచ్చు: రాజ్ థాకరే ఆగ్రహం
ముంబై: యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష పైన ఇటీవల మాట్లాడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే మండిపడ్డారు. సల్మాన్ ఖాన్‌ను వెదవగా పేర్కొన్నారు. ఆయన స్టుపిడ్ కావొచ్చన్నారు.
నసీరుద్దీన్ షా వంటి వారు మహారాష్ట్రలోని ప్రజల ఇతర సమస్యలను పట్టించుకుంటున్నారా అని రాజ్ థాకరే ప్రశ్నించారు.

యాకూబ్ మెమెన్‌ను ఉరి తీయాల్సిందేనని 1993 బాంబు పేలుళ్ల బాధితులు బుధవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీని పైన 1600 మంది సంతకాలు చేశారు.
ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాగపూర్, ముంబైలలో మహారాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హైదరాబాదులోని పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications