వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు వేసేందుకు మూడున్నర గంటలు క్యూలో నిలబడ్డ కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్నికల అధికారులు మొత్తం 51,687 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రామ్‌గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందడంతో ఎన్నిక వాయిదాపడింది. బరిలో 187 మంది మహిళా అభ్యర్థులు సహా 2274 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 7.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Rajasthan Assembly Polls 2018 Live Updates: Will Raje return as CM for third time

Newest First Oldest First
5:11 PM, 7 Dec

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల సమయానికి 72.7 శాతం ఓటింగ్ నమోదయింది. ఐదు గంటలకు ఓటింగ్ సమయం ముగుస్తుంది. ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
4:45 PM, 7 Dec

ఓటు వేసేందుకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ దాదాపు మూడున్నర గంటల పాటు క్యూలో నిలబడ్డారు. ఓటు వేసేందుకు ఆయన రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో 172వ నంబరు పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. ఈవీఎం సాంకేతిక సమస్య కారణంగా చాలాసేపు పనిచేయ లేదు. దీంతో ఆయన తన వంతు వచ్చేదాకా క్యూలో నిలబడ్డారు. ఆయన ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్‌ బూత్‌కు వెళ్లగా అప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారు. మేఘవాల్‌ లైన్‌లో నిలబడగా 11.30కు ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది.
3:55 PM, 7 Dec

రాజస్థాన్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు 60 శాతం పోలింగ్ నమోదయింది.
2:07 PM, 7 Dec

రాజస్థాన్‌లో 41.53 శాతం పోలింగ్ జరిగింది.
1:32 PM, 7 Dec

రాజస్థాన్‌‌లో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఓటింగ్ శాతం 41.53 నమోదయింది.
12:35 PM, 7 Dec

97 ఏళ్ల నాగేందర్ సింగ్ చౌహాన్, అతని సతీమణి 85 ఏళ్ల యువరాజ్ కువార్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝలావార్ పోలీంగ్ స్టేషన్లో వారు ఓటు వేశారు.
12:23 PM, 7 Dec

రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్.. కిక్కిరిసిన క్యూలైన్లో చాలాసేపటి నుంచి తన వంతు కోసం వేచిచూశారు. బికనీర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 172 వద్దకు ఆయన ఓటేసేందుకు వచ్చిన సమయానికే వందల మందికి పైగా ఓటర్లు క్యూలైన్ లో వేచివున్నారు. దీంతో ఉదయం 9 గంటల సమయం నుంచి వేచి చూసి, ఓటేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్, తెలంగాణల్లో వీఐపీ అయినా, వీవీఐపీ అయినా, సామాన్య ఓటర్లతో సమానంగా క్యూ లైన్లలో నిలబడి, వేచి చూసి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
12:17 PM, 7 Dec

జోధ్‌పూర్ రాయల్ గజ్ సింగ్, అతని సతీమణి శుక్రవారం సర్దార్‌పూర్ నియోజకవర్గంలోని 194వ బూత్‌లో ఓటు వేశారు.
12:09 PM, 7 Dec

రాజస్థాన్‌లో మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 20.9 శాతం పోలింగ్ నమోదయింది.
11:34 AM, 7 Dec

రాజస్తాన్‌లో 105 ఏళ్ల మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెను వారి కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్‌కు తీసుకు వచ్చారు. జైపూర్‌లోని కృష్ణపురలో ఆ కురువృద్ధురాలు ఓటు వేశారు.
10:42 AM, 7 Dec

రాజస్థాన్‌లోని బికనీర్‌లోని బూత్ నెంబర్ 172లో ఈవీఎంలో టెక్నికల్ సమస్య రావడంతో దానిని మార్చివేశారు.
10:10 AM, 7 Dec

జోద్‌పూర్‌లో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
9:07 AM, 7 Dec

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై మాట్లాడుతూ.. ఓటింగ్ జరిగి ఫలితాలు వచ్చాక పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
8:59 AM, 7 Dec

బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైపూర్‌లోని వైశాలినగర్ బూత్ 252లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
8:57 AM, 7 Dec

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే జలావర్ నియోజకవర్గంలోని జల్‌రకపఠన్ 31ఏ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
8:54 AM, 7 Dec

రాజస్థాన్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు జోద్‌పూర్ జిల్లాలోని సర్దార్‌పూర్ నియోజకవర్గంలోని 108వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
8:28 AM, 7 Dec

ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇది ఓట్ల పండుగ అని, ఈ ఎన్నికల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
8:23 AM, 7 Dec

రాజస్థాన్‌లో పోలింగ్ పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు రాజస్థాన్ మంత్రి గులాబ్ చంద్ కటారియా ఉదయపూర్‌లోని శివాలయంలో పూజలు నిర్వహించారు.
7:42 AM, 7 Dec

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు.
7:29 AM, 7 Dec

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.
6:06 AM, 7 Dec

వసుంధరా రాజే మళ్లీ అధికారంలోకి వస్తారా.. కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
6:06 AM, 7 Dec

1,44,941 మంది పోలీసులతో కలిపి 640 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు సాయం చేసేందుకు తాము ఎన్‌సీసీ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రధానం పోటీ ఉంది.
6:05 AM, 7 Dec

ఇప్పటి వరకు అసెంబ్లీలో బీజేపీకి 160 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి 25, బీఎస్పీకి 2, ఎన్‌యూజెడ్‌పీకి 2, ఎన్పీపీకి 1 సీట్లు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. మరో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఫలితాలు డిసెంబరు 11న రానున్నాయి.
6:05 AM, 7 Dec

ఎన్నికల్లో బీజేపీ 200 మంది అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్‌ 195 మందిని నిలబెట్టింది. మిగతా ఐదు స్థానాలను తమ మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్‌దళ్‌, జనతా దళ్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలకి ఇచ్చింది. బీఎస్పీ 196, ఆమ్‌ ఆద్మీ 100కి పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
6:05 AM, 7 Dec

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్నికల అధికారులు మొత్తం 51,687 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రామ్‌గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందడంతో ఎన్నిక వాయిదాపడింది. బరిలో 187 మంది మహిళా అభ్యర్థులు సహా 2274 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 7.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 51,687 పోలింగ్‌ స్టేషన్లలో దాదాపు 13వేల కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు.

English summary
Rajasthan assembly elections: Polling held between 7 am and 5 pm for 199 seats. The main contest is between the ruling BJP and the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X