ఎగ్జిట్ పోల్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌దే గెలుపు, ఏ సర్వే ఏం చెబుతుందంటే?
జైపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన (నేడు) ముగిశాయి. ఎన్నికలు ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. 90 స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో గెలుపు బీజేపీదేనని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీకి 85, కాంగ్రెస్ పార్టీకి 105, బీఎస్పీకి ఇద్దరు, ఇతరులకు 7 సీట్లు వస్తాయి. ఇండియా టుడే - యాక్సిస్ సర్వే ప్రకారం బీజేపీకి 55 నుంచి 72, కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 141, ఇతరులకు 4 నుంచి 11, సీ ఓటరు సర్వే ప్రకారం బీజేపీకి 60, కాంగ్రెస్ పార్టీకి 137 సీట్లు, ఇతరులకు 2 సీట్లు, జన్ కీ బాద్ ప్రకారం బీజేపీకి 93, కాంగ్రెస్ పార్టీకి 91, ఇతరులకు 15 సీట్లు, పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం బీజేపీకి 82, కాంగ్రెస్ పార్టీకి 108, ఇతరులకు 9 సీట్లు, న్యూస్ 24 పేస్ ప్రకారం బీజేపీకి 75, కాంగ్రెస్‌కు 115, ఇతరులకు తొమ్మిది, సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లు వస్తాయని తేలింది.












Click it and Unblock the Notifications