Rajasthan Polls: డిసెంబర్ 3న రాజస్తాన్ నుంచి కాంగ్రెస్ మాయం-ప్రధాని మోడీ ధీమా..
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఒకటైన రాజస్తాన్ లో ప్రధాని మోడీ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని భరత్ పూర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల్ని నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్తులను చూసీ చూడనట్లుగా వదిలేసి మహిళలపై దాడులు, మతఘర్షణలకు కారణమైందని ప్రధాని మోడీ విమర్శించారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్రధాని మోడీ జాదూగర్(మాయగాడు)గా అభివర్ణించారు. రాష్ట్రంలో డిసెంబర్ 3న(ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు) కాంగ్రెస్ పార్టీ మాయం కావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని, మరోవైపు రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసన్నారు. రాజస్థాన్‌ను అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపిందన్నారు. అందుకే రాజస్థాన్ మాంత్రికుడికి (గెహ్లాట్) ఓట్లు పడవన్నారు.

అలాగే కాంగ్రెస్ ఎక్కడ వచ్చినా ఉగ్రవాదులు, నేరగాళ్లు, అల్లరి మూకలను వదులుతారని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్‌కు బుజ్జగింపులే సర్వస్వం అన్నారు. మీ ప్రాణాలను పణంగా పెట్టినా బుజ్జగింపుల కోసం కాంగ్రెస్ ఎంతవరకైనా వెళ్లగలదని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులపై అత్యధికంగా నేరాలు జరిగాయన్నారు. కాబట్టి ఈసారి దళితులు కాంగ్రెస్ కు ఓటు వేయబోరన్నారు.
రాజస్తాన్ లోని 200 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేల్చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి గెలుస్తామనే ధీమాలో ఉంది. రాష్ట్రంలో ఐదేళ్ల కోసారి ప్రభుత్వాల్ని మార్చేసే సంప్రదాయం ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications