విజయ్ పార్టీ టార్గెట్ గా రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి దూకుడుగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికలలో విజయ్ దళపతి పార్టీ రంగంలోకి దిగుతుందని కూడా ప్రకటించాడు .
డీఎంకే పార్టీపైన రజినీకాంత్ వ్యాఖ్యలు
అయితే హీరో విజయ్ పార్టీ రంగంలోకి దిగిన నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ డిఎంకె పని అయిపోయిందని ఇక డిఎంకె పార్టీని మూసేసుకోవాల్సిందేనని కొందరు వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీపైన తాజాగా చేసిన సంచలన కామెంట్స్ తమిళ రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారగా, విజయ్ పార్టీని ఉద్దేశించి రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రస్తుతం తమిళ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

ఎలాంటి తుఫానునైనా తట్టుకునే మర్రిచెట్టు డీఎంకే
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని డిఎంకె పార్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఒక మర్రిచెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాను నైనా ఈ పార్టీ ఎదుర్కొంటుందని, ఆ మర్రి చెట్టును ఎవరు కదిలించలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఇతరులను బాధించకూడదని ఆయన పేర్కొన్నారు.
కరుణానిధి గురించి రజినీకాంత్ వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యే వారని ఆయన ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని రజనీకాంత్ పేర్కొన్నారు. కరుణానిధి గురించి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడారంటే ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదని పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారని రజినీకాంత్ అన్నారు.
విజయ్ పార్టీ నుద్దేశించే రజినీకాంత్ వ్యాఖ్యలు చేశారా?
రాజకీయాలలో సీనియర్లను హ్యాండిల్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదని కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ ఉన్నారని కితాబిచ్చారు రజినీకాంత్. వరుసగా పార్టీకి విజయాలను తీసుకుని వస్తున్నారని స్టాలిన్ కు నా అభినందనలు అంటూ పేర్కొన్నారు. ఇక తమిళ రాజకీయాలలో సమూల మార్పు కోసం పార్టీ పెట్టిన విజయ్ కు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా రజినీకాంత్ మాట్లాడారని తమిళ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే తాజా రజినీ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications