Rajinikanth: సినిమాలకు రజినీ గుడ్‌బై..తెరపై ఇక తలైవా కనిపించరా..?

Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అని ఒక వార్త ప్రస్తుతం ఫాన్స్ అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. ఐదు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని తన స్టైల్ తో, తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అలరించిన తలైవా సినిమాలకు గుడ్బై చెప్పనున్నారు అని ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే అనేక మార్లు రజినీకాంత్ విషయంలో ఇటువంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైనా, ప్రస్తుతం నిజంగానే రజినీకాంత్ ఇక సినిమాలకు దూరం కాబోతున్నారా అన్నది అభిమానుల ఆందోళనకు కారణం అవుతుంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపి ఒక విధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్న సూపర్ స్టార్ లలో రజినీకాంత్ ఒకరు.

 Rajinikanth

లోకేష్ కనగరాజ్ తో తీస్తున్న తన 171వ సినిమా తలైవా చివరి సినిమా కావచ్చని దర్శకుడు నటుడు మిస్కిన్ తాజాగా చెప్పిన విషయాలతో ఇప్పుడు ఆయన సినీప్రస్థానం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ మురుగదాస్ తో చేసిన దర్బార్ సినిమా రజినీకాంత్ చివరిసినిమా అని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత రజనీకాంత్ కబాలి, పేట్టా ఇలా వరుసగా ఎన్నో సినిమాలు చేసి రజనీకాంత్ తన దూకుడును కొనసాగిస్తూ వచ్చారు.

ఇక ఇదే క్రమంలో ఆయన ప్రస్తుతం నెల్సన్ తో జైలర్ సినిమాను, తన కుమార్తె ఐశ్వర్య కోసం లాల్ సలాం సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను పోషిస్తున్నారు. ఆపై సూపర్ స్టార్ జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఇవి కాక లోకేష్ కనగరాజ్ తో రజనీకాంత్ సినిమా ను చేయనున్నారు.

అయితే తాజాగా ప్రఖ్యాత తమిళ చిత్ర నిర్మాత మరియు నటుడు మిస్కిన్ రజనీకాంత్ చివరి సినిమా అదేనని, తన చివరి చిత్రానికి దర్శకత్వం వహించమని లోకేష్ కనగరాజ్ ను స్వయంగా రజినీకాంత్ పిలిచారని వెల్లడించారు. ఐదు దశాబ్దాలపాటు సాగిన సూపర్ స్టార్ కెరీర్లో ఈ 171 వ చిత్రం చివరి చిత్రం కావొచ్చని మిస్కిన్ వెల్లడించారు.

 Rajinikanth

అయితే రజనీకాంత్ అభిమానులు ఇలా అనేక మార్లు ఇప్పటికే ప్రచారం జరగడంతో, ఇప్పుడు ఈ వార్త ను కూడా పూర్తిగా విశ్వసించడం లేదు. ఇది నిజం కాకూడదని వారంతా కోరుకుంటున్నారు. తలైవా మానియా ఆగదని, ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలని వారంతా కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+