దీపావళి తర్వాత మాహారాష్ట్రకు: కేంద్ర హోం మంత్రి

న్యూఢిల్లీ: దీపావళి పండుగ తర్వాత మహారాష్ట్రకు వెళతానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. మహారాష్ట్రలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎమ్మేల్యేలతో సమావేశం కానున్నారు.

బీజేపీ పార్టీ తరపున మహారాష్ట్రకు పరిశీలకులుగా రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నద్దా నియమితులైయ్యారు. దీంతో హోం మంత్రి రాజ్‌నాధ్‌తో పాటు పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా కూడా మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ప్రభు్త్వ ఏర్పాటుతో పాటు, పార్టీ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అంశంపై కూడా రాజ్‌నాధ్ చర్చించనున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకా ఎవరి పేరుని అధికారకంగా ఖరారు చేయలేదని రాజ్‌నాధ్ స్పష్టం చేశారు. మహా సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నిస్ ముందు ఉండగా.. ఆ తర్వాత స్ధానాల్లో ఏక్‌నాధ్ ఖడ్సే, వినోద్ తవడే ఉన్నారని చెప్పారు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను భారతీయ జనతా పార్టీకి సుమారుగా 22 అసెంబ్లీ సీట్లు అవసరం ఉంది. 288 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 123 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

బీజేపీతో 25 సంవత్సరాలుగా ఉన్న మిత్రత్వాన్ని తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీకి మహారాష్ట్రలో 63 స్ధానాలను కైవసం చేసుకుంది. భాజపా - శివసేన కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Rajnath Singh, JP Nadda to visit state only after Diwali

అంతక ముందు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని పోలీస్ మెమోరియల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ జాతీయ పోలీసు స్మారకాన్ని ఈ ఏడాది ఏర్పాటు చేస్తామని అన్నారు. దీపావళి సందర్భంగా దేశంలో ఉగ్రవాద దాడులను కొట్టిపారేయలేమని జ్ నాథ్ సింగ్ చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పిన ఆయన అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలకు పలు రాష్ట్రాల్లో గతంలో ఈ తరహా దాడులు జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా దీపావళి సందర్భంగానూ ఉగ్రవాదులు విరుచుకుపపడే అవకాశం ఉందని.. నిఘా వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం రాష్ట్రాలను అప్రమత్తం చేశామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+