'పార్ట్- 2 ఉంది'.. పాక్ కు రాజ్ నాథ్ సింగ్ సంచలన వార్నింగ్
ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్-2, 3 ఉంటాయని హింట్ ఇచ్చారు. పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే కచ్చితంగా మరింత ధీటుగా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. మొరాకో పర్యటనలో ఉన్న రాజ్ నాథ్ సింగ్.. అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజంపై భారత్ వైఖరి ఎప్పటికీ మారదని.. ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తామని అన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు.
కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్-2, 3 కూడా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ఇండియన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్ వ్యవహార శైలిపైనే ఆపరేషన్ సింధూర్ పార్ట్-2, పార్ట్-3 ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ మొరాకో పర్యటనలో ఉన్నారు. భారత రక్షణమంత్రి ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది.

ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలు ఇలా ఉన్నాయి. ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.












Click it and Unblock the Notifications