Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రగ్స్ చాట్ చేశా.. కానీ తీసుకోలేదన్న రకుల్.. నేడు కొనసాగుతున్న దీపికా పదుకొనే విచారణ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ డ్రగ్స్ కు సంబంధించిన చాట్ చేసినట్టు గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు రకుల్ ను విచారణ చేశారు . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న విచారించిన అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్ పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది . నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) నిన్ననే రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించి ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తుంది .

డ్రగ్స్ చాట్ చేశా కానీ డ్రగ్స్ తీసుకోలేదన్న రకుల్ ప్రీత్ సింగ్

డ్రగ్స్ చాట్ చేశా కానీ డ్రగ్స్ తీసుకోలేదన్న రకుల్ ప్రీత్ సింగ్

దాదాపు నాలుగు గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమె అందించిన సమాచారాన్ని రికార్డ్ చేసి, దాన్ని విశ్లేషించి నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లుగా తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ చాట్ చేసినట్లు ఒప్పుకున్నారు కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసులో మరో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వారెవరు అనేది తెలియరాలేదు .

డ్రగ్స్ సరఫరాదారులెవరో తనకు తెలీదన్న రకుల్

డ్రగ్స్ సరఫరాదారులెవరో తనకు తెలీదన్న రకుల్

డ్రగ్స్ సరఫరాదారులతో తను ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు చెప్పినట్లుగా సమాచారం. నార్కోటిక్స్ అధికారులు నిన్న రకుల్ ప్రీత్ ఇంటి పై దాడి చేసి ఆమె నివాసంలో స్టాష్ గుర్తించిన అధికారులు, దానిపై ప్రశ్నించగా అది రియా చక్రవర్తికి చెందిందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించినట్లుగా సమాచారంరకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారంలో తనపై మీడియా దుష్ప్రచారం చేస్తోందని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

నాలుగు గంటల విచారణలో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పిన రకుల్ ?

నాలుగు గంటల విచారణలో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పిన రకుల్ ?

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంపించిన సమన్లు కూడా అందలేదని బుకాయించిన రకుల్ ప్రీత్ సింగ్ కు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెండోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు సహకరించకుండా ఇబ్బంది పెడితే ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు అందాయని ,ఎన్సీబీ విచారణకు హాజరైంది. ఇక నార్కోటిక్స్ అధికారుల ముందు రియా చక్రవర్తి తో చేసిన డ్రగ్స్ చాటింగ్ ను అంగీకరించింది.

నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో కీలక విషయాలనే చెప్పినట్టు తెలుస్తుంది . నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్టు తెలుస్తుంది .

ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా .. కొనసాగుతున్న విచారణ

ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా .. కొనసాగుతున్న విచారణ

నేడు ఇప్పటికే దీపికా పదుకొనే ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా దీపిక పదుకొనే నేడు ఎన్సీబీ ప్రస్తుతం దీపికాను విచారిస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెండు రోజుల క్రితం విచారణకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేయగా విచారణలో భాగంగా నేడు దీపికా పదుకొనే, శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్ లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు సమాధానం చెప్పనున్నారు.ముంబై కొలాబాలోని అపోలో బండర్ లో ఎవెలిన్ గెస్ట్ హౌస్ కు దీపికా పదుకొనే వెళ్లారు. ప్రస్తుతం ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారిస్తున్నారు.

Recommended Video

    Rakul Preet Singh : Narcotics Control Bureau ఎదుట ఈ రోజు విచారణకు హాజరైన Rakul || Oneindia Telugu
    దీపికాతో పాటు నేడు కూడా మేనేజర్ కరిష్మా ప్రకాష్ విచారణ

    దీపికాతో పాటు నేడు కూడా మేనేజర్ కరిష్మా ప్రకాష్ విచారణ

    దీపికా పదుకొనే తర్వాత సారా అలీఖాన్ , శ్రద్ధ కపూర్ లను ఎన్సీబీ విచారించనుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిన్న కూడా విచారణకు హాజరైన కరిష్మా ప్రకాష్ ఈ రోజు కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. దీపికా పదుకొనే తరువాత ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వచ్చారు. బాలీవుడ్‌లో డ్రగ్‌ కేసు కు సంబంధించి దీపిక, కరిష్మాను ఏజెన్సీ ప్రశ్నించనుంది. నిన్న కరిష్మా ప్రకాష్ ను మాత్రమే ప్రశ్నించిన ఎన్సీబీ , ఈ రోజు ఇద్దరినీ ప్రశ్నించి వారి చెప్పే సమాధానాలను పోల్చి చూడనుంది . ఈ రోజు దీపికా పదుకొనే , కరిష్మా ప్రకాష్ ఏం చెప్తారు . కొత్తగా ఎవరి పేర్లు వెల్లడిస్తారనేది ఆసక్తికర అంశం .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+