సినీ నటి బ్యాగ్‌లో బుల్లెట్: నాలుగ్గంటలు విచారణ
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో బుల్లెట్ పెట్టుకున్న సినీ నటి రాకుల్ ప్రీత్‌ను ఢిల్లీ దేశీ విమానాశ్రయం సిఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. శనివారంనాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైకి వెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన రాకుల్ ప్రీత్‌ను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఆమె సంచీల్లో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు వారు గుర్తించారు. దాంతో ఆమె సంచీలను గాలించారు. ఓ సంచీలోంచి బయటపడిన వస్తువు బుల్లెట్ కావడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు.
దాంతో ఆమెను పక్కన నిలబడాలని చెప్పారు. అది 8ఎంఎం బుల్లెట్ అని సిబ్బంది ఆమెకు చెప్పారు. అది భారతదేశంలో లభించదు. ఆ తర్వాత ఆమెను ఢిల్లీ దేశీ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి నాలుగు గంటల పాటు విచారించారు.

తనకు విపరీతంగా భయమేసిందని, చెమటలు పట్టాయని, ఏడ్చేశాని రాకుల్ ప్రీత్ చెప్పింది. తన తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నాడని, తాను ఆయనను పిలిచానని, ఆ బుల్లెట్ అతనిది అయి ఉండవచ్చనని భావిచాని, తన తండ్రి ఆయుధానికి లైసెన్స్ ఉందని ఆమె వివరించింది. అయితే, తన తండ్రి అది తనది కాదని, అటువంటిది ఇండియాలో తయారు కాదని చెప్పారని ఆమె వివరించింది. అది డెడ్ బుల్లెట్ అని తేలిందని ఆమె చెప్పింది.
అయితే, తన సంచీలోకి అది ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారని, తాను ఆలోచించడం ప్రారంభించానని, రెండు రోజుల క్రితం తాను బ్యాంకాక్ నుంచి వచ్చానని, అది నకిలీ బుల్లెట్ అని కూడా పోలీసులు తేల్చారని ఆమె చెప్పింది.
ఓ తమిళ సినిమాలో తాను నటించానని, దాంట్లో బొమ్మ తుపాకి వాడానని ఆమె చెప్పింది. బుల్లెట్‌లో మొత్తం ప్లాస్టిక్ ఉందని చెప్పింది. తనను పోలీసులు వదిలేసి తాను తుపాకి వాడిన సినిమా డివిడి పంపించాలని పోలీసులు తనకు చెప్పినట్లు ఆమె తెలిపింది.












Click it and Unblock the Notifications