అయోధ్య రామాలయంలోకి అడుగుపెట్టిన బాల రాముడు
లక్నో: రామజన్మభూమి అయోధ్యలో పూజలందుకునే బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంలో రాముడి విగ్రహాన్ని ట్రక్కులో ఆలయం వద్దకు తీసుకొచ్చారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక క్రేన్ ద్వారా విగ్రహాన్ని పైకెత్తి గర్భగుడిలోకి తరలించారు.
అనంతరం గర్భగుడిలో ప్రతిష్ఠించారు.
కాగా, బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో బాల రాముడి విగ్రహాన్ని వివేక్ సృష్టి కాంప్లెక్స్ నుంచి జన్మభూమి కాంప్లెక్స్‌కు తరలించారు. ఏటీఎస్ కమాండోల భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహాన్ని అన్నివైపుల నుంచి పాలిథిన్ కవర్లతో కప్పి ఉంచారు. అంతకుముందు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.

వేద పండితుల మంత్రాల మధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహం తరలింపు పనులను మందిర నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర పర్యవేక్షించారు. కాగా, ఏడు రోజుల ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజ నిర్వహించారు. గురురవారం సాయంత్రం జలధివాస్ కార్యక్రంలో భాగంగా విగ్రహానికి జలాభిషేకం నిర్వహిస్తారు.
#WATCH अयोध्या, उत्तर प्रदेश: भगवान राम की मूर्ति को अयोध्या में राम मंदिर के गर्भगृह के अंदर लाया गया।
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024
मूर्ति को क्रेन की मदद से अंदर लाने से पहले गर्भगृह में विशेष पूजा की गई। (17.01)
(वीडियो सोर्स: शरद शर्मा, मीडिया प्रभारी, विश्व हिंदू परिषद) pic.twitter.com/eLrKhRVpcR
గణేశాంబిక పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యవచనం, మండప ప్రవేశం, పృథ్వి- కుర్మ- అనంత- వరాహ- యజ్ఞభూమి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠకు ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇంజినీర్లు సమస్యను పరిష్కరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications