Ramadan 2023 : కనిపించని రంజాన్ నెలవంక-ఉపవాసాలు ఎప్పటినుంచి అంటే ?
రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా ఆకాశంలో నెలవంక దర్శనమిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.
ఖురాన్ ప్రకారం ముస్లింల జీవనవిధానంలో పాటించే ఐదు మూలస్తంభాల్లో రంజాన్ ఉపవాసాలు కూడా ఒకటి. ప్రతీ ఏటా రంజాన్ నెలవంక దర్శనం తర్వాత ఉపవాసాలు ప్రారంభించి సరిగ్గా నెలరోజుల తర్వాత వీటిని ముగించి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారం ఈ ఏడాది కూడా ముస్లింలు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నెలవంక దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్ ఇది 720 గంటల పాటు సాగుతంది. అంటే నాలుగు వారాల రెండు రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం మధ్య ఉపవాస దీక్షలు పాటిస్తారు. శాంతి, మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తారు. సమాజానికి దాతృత్వం లేదా జకాత్ రూపంలో తిరిగి ఇస్తారు. లేదా నిరుపేదలకు ఆహారం అందించడం, వారి ఆత్మలను ప్రకాశవంతం చేయడానికి ఆత్మపరిశీలన చేయడం వంటి మానవతా కార్యకలాపాలలో పాల్గొంటుంటారు.

రంజాన్ 2023 నెలవంక ఈ రాత్రి అంటే మార్చి 22న కనిపిస్తుందని భావించినా అలా జరగలేదు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్ లోనూ నెలవంక కనిపించలేదు. వాస్తవానికి ప్రతీ సంవత్సరం గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతాయి. గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపించిన ఒక్కరోజు తర్వాత భారత్ లో నెలవంక కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే నెలవంక కనిపించాక ఒక్కరోజు తర్వాత భారత్ లో ఉపవాసాలు ప్రారంభమవుతాయి.
ఇవాళ గల్ఫ్ దేశాలతో పాటు భారత్ లోనూ నెలవంక దర్శనం కాకపోవడంతో రేపు గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపిస్తుందని భావిస్తున్నారు. అంటే మార్చి 24 నుంచి గల్ప్ దేశాల్లో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే భారత్ లో ఒక్కరోజు తర్వాత అంటే మార్చి 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం రంజా్ 1444 AH నుండి చంద్రుని దర్శనాన్ని బట్టి మొదటి ఉపవాసం పాటిస్తారు.












Click it and Unblock the Notifications