Ramadan: ఇళ్లకే పరిమితం అయిన ముస్లీం సోదరులు, ప్రార్థనలు, సింపుల్ గా రంజాన్, కరోనా ఎఫెక్ట్ !
చెన్నై/న్యూఢిల్లీ: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా బావించే రంజాన్ పండుగను శుక్రవారం జరుపుకున్నారు. భారతదేశంలోని వివిద నగరాల్లో శుక్రవారం ఉదయం ముస్లీం సోదరులు కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేసి ప్రతిఒక్కరిని చల్లగా చూడాలని ఆ భగవంతుడు (అల్లా)ను వేడుకున్నారు. కరోనా నియమాల కారణంగా చాలా మంది ముస్లీం సోదరులు మసీదులు, ఈద్గా మైదానాలకు వెళ్లకుండా వారివారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు.

రాష్ట్రపతి మనవి
ముస్లీం సోదరులు అందరూ సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని, ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నానని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు,వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు. కోవిడ్ నియమాలు పాటించి ప్రతిఒక్కరూ వారివారి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మనం అవకాశం ఇవ్వకూడాదని రాష్ట్రపతి రాథ్ నాథ్ కోవింద్ మనవి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లీం సోదరులకు రంజాన్ శుభకాంక్షలు తెలిపారు.

రంజాన్ అంటేనే పవిత్రం... ప్రత్యేకత
ముస్లీం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది, రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ముస్లీం సోదరులు వేకువ జామున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటారు. తరువాత నమాజ్ చేసి ఉపవాసం పూర్తి చేస్తారు. తాము చేసిన తప్పులు, పాపాలు తొలగించాలని, మమ్మల్న్ని, మా కుటుంబ సభ్యులను, ప్రజలు అందరిని కాపాడాలని ముస్లీం సోదరులు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలలో ఆ అల్లా మేము చేసిన పాపాలు మొత్తం క్షమిస్తాడని ముస్లీం సోదరులు గట్టిగా నమ్ముతుంటారు.

ఇళ్లకే పరిమితం అయిన ముస్లీం సోదరులు
శుక్రవారం దాదాపుగా ముస్లీం సోదరులు అందరూ వారివారి ఇళ్లకే పరిమితం అయ్యారు. శుక్రవారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు దరించిన ముస్లీం సోదరులు వారి ఇళ్లలోని హాల్ లో, బాల్కనీలో భగవంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మామూలుగా రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానాలు, మసీదులు చేరుకుని సామూహిక ప్రార్థనలు చెయ్యడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ముస్లీం సోదరులు దాదాపుగా వారివారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు.
Recommended Video

ఫోన్లలో రంజాన్ శుభాకాంక్షలు
అయితే గత ఏడాది, ఈ సంవత్సరం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ దెబ్బతో హడలిపోవడంతో ముస్లీం సోదరులు సర్వసాధారణంగా రంజాన్ పండుగ జరుపుకున్నారు. ప్రతిఒక్కరు మాస్క్ లు వేసుకుని దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లీం సోదరులు వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఫోన్లు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications