పాకిస్తాన్‌ను 2 ముక్కలు చేసిన ఇండియా ఫస్ట్ జేమ్స్‌బాండ్.. రామేశ్వర్‌నాథ్ కావో

పాకిస్థాన్‌ను ముక్కలు చేసిన వ్యూహం వెనక ఉన్న మాస్టర్‌ మైండ్.. సిక్కింను భారత్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన బుద్ధిజీవి.. అమెరికా సీఐఏ, బ్రిటన్ ఎంఐ6, ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ వంటి ప్రపంచ స్థాయి నిఘా సంస్థల సరసన మన దేశ 'రా' ను నిలబెట్టిన ఘనత ఇండియన్ జేమ్స్ బాండ్ రామేశ్వర్‌ నాథ్‌ కావో దే. సింపుల్ గా ఆర్.ఎన్.కావో అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ రియల్ లైఫ్ స్పై మాస్టర్ జీవితం బాలీవుడ్‌లో వెండితెరకు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సాహసోపేత కథను తెరపైకి తీసుకురానున్నారు.

వారణాసిలో జన్మించారు

1918 మే 10న వారణాసిలో జన్మించిన కావో.. , అలహాబాద్‌ విశ్వవిద్యాలంలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎం.ఏ. చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం, బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థులు ఆయన పేరును 'కౌ' ఆవు అని వెక్కిరించడంతో అంతర్ముఖుడిగా మారారు. 1940లో ఐసీఎస్ విజయం సాధించి ఇంపీరియల్ పోలీస్‌లో చేరిన ఆయన, సర్దార్ పటేల్ చొరవతో ఐబీ లోకి అడుగుపెట్టారు. ప్రధాని నెహ్రూ భద్రతకు చీఫ్ సెక్యూరిటీగా ఉంటూనే, దేశంలో ఎన్‌ఎస్‌జీ (NSG), ఎస్‌పీజీ (SPG) వంటి వ్యవస్థల ఏర్పాటుకు పునాది వేశారు. ఘనా దేశం తొలి గూఢచార సంస్థ ఏర్పాటులోనూ ఆయన సేవలు అందించారు.

Rameshwar Nath Kao India s First James Bond Who Played a Key Role in Pakistan s Division

ఇండియాను అనుమానించిన చైనా

1955లో ఇండోనేషియాలో జరగాల్సిన ఆఫ్రో-ఆసియాన్‌ సదస్సుకు వెళ్లాల్సిన చైనా ప్రధాని జౌ ఎన్‌లై విమానం గాల్లోనే బాంబు పేలుడుకు గురై కూలిపోయింది. చైనా భారత్‌ను అనుమానించడంతో, నెహ్రూ ఈ కేసును కేవలం 37 ఏళ్ల కావోకు అప్పగించారు. పట్టువదలకుండా శ్రమించిన కావో.. హాంకాంగ్‌లో గ్రౌండ్ మెకానిక్ చౌ చు తైవాన్ గూఢచారి ద్వారా లంచం తీసుకుని బాంబు అమర్చినట్లు శాస్త్రీయ ఆధారాలతో నిరూపించి భారత్‌పై పడిన మచ్చను తొలగించారు.

22వ రాష్ట్రంగా సిక్కిం

1962 నాటి యుద్ధ వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇందిరాగాంధీ, 1968లో 'రా' ను ఏర్పాటు చేయగా కావో తొలి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే బంగ్లాదేశ్ విముక్తి కోసం 'ముక్తివాహిని'కి శిక్షణ ఇప్పించడం, 1971 యుద్ధంలో పాక్ పాలకుల కమ్యూనికేషన్లను ట్రాక్ చేసి మన వాయుసేను అప్రమత్తం చేయడం జరిగాయి. 1975లో ఒక్క చుక్క రక్తపాతం లేకుండా సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా విలీనం చేయించడంలో కావో వేసిన మాస్టర్ ప్లానే కీలకం. పాక్ అణు ప్రయోగాల డొల్లతనాన్ని విదేశీ మీడియా ద్వారా బయటపెట్టారు.

మీడియాకు, కెమెరాలకు దూరం

1984లో ఇందిరాగాంధీ హత్య సమయంలో చైనా పర్యటనలో ఉన్న ఆయన, నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కోరిక మేరకు పంజాబ్ సంక్షోభ సమయంలోనూ సేవలందించారు. జీవితాంతం మీడియాకు, కెమెరాలకు పూర్తిగా దూరంగా అత్యంత గోప్యమైన జీవితాన్ని గడిపిన ఈ జేమ్స్ బాండ్ 2002 జనవరి 20న తుదిశ్వాస విడిచారు. దేశం కోసం నిశ్శబ్దంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యోథుడి కథ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+