ఉచిత హామీకి గ్రీన్ సిగ్నల్, రోజుకు 60 లక్షల మంది లేడీస్ ఆర్ టీసీలో ఫ్రీగా తిరిగేస్తున్నారు !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అంతకాలం అధికారంలో ఉన్న బీజేపీని చిత్తు చేసి అధికారంలోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదో ఉచితహామీ అయిన యువ నిధి పథకానికి సంబంధించి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు గౌరవ వేతనం పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలౌతుంది.

ఈ స్కీమ్ లకు అర్హత ఉన్న యువతి, యువకులు ఈ నెలాఖరులో పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఐదో ఉచితహామీని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుందని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.. కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా 5 హామీలను జనాలకు ఇచ్చింది.

 Randeep Singh Surjewala said that he will complete the work for the relief fund for the unemployed in Karnataka.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచితహామీలను ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ కు అసెంబ్లీలో 136 సీట్లు ఇచ్చి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారని, ఇప్పుడు మా ప్రభుత్వం వారి బాధ్యతను నెరవేర్చడానికి సిద్దం అయ్యారని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. శక్తి పథకం కింద 114. 54 కోట్ల మంది మహిళల ఆర్ టీసీ బస్పుల్లో ఉచిత ప్రయాణం చేశారని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

 Randeep Singh Surjewala said that he will complete the work for the relief fund for the unemployed in Karnataka.

శక్తి పథకంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని మహిళలు ప్రతిరోజూ 60 నుండి 62 లక్షల మంది ప్రభుత్వ ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని పొందారని, ఇప్పటి వరకు 114. 54 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని, దీనికి రూ 2, 700 కోట్లు ఖర్చు అయ్యిందని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

గృహజ్యోతి కింద నెలకు రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నామని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించుకున్న రాష్ట్రంలోని 1 కోటి 60 లక్షల కుటుంబాల వినియోగదారులు గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, దీని వల్ల కర్ణాటక ప్రభుత్వానికి ప్రతి నెల దాదాపు రూ. 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు.

 Randeep Singh Surjewala said that he will complete the work for the relief fund for the unemployed in Karnataka.
ఊర్లో వాళ్లు పార్లమెంట్ ఎంట్రీ పాస్ లు అడిగితే నేను అయినా, సీఎం అయినా ఇస్తారు !

గృహ లక్ష్మి పథకం కింద రూ. 2300 కోట్ల డబ్బు ప్రతి నెలా కుటుంబ యజమాని ఖాతాకు 2 వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని, డీబీటీ ద్వారా 1 కోటి 16 లక్షల మంది మహిళల ఖాతాలకు నేరుగా రూ. 2, 300 కోట్ల డబ్బు జమ అవుతోందని రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు. అన్న భాగ్య పథకం కింద ప్రతి నెలా రూ 656 కోట్లు జమ అవుతుండగా, ప్రతినెలా 5 కిలోల బియ్యం బదులు రూ.170 చొప్పున కేజీ రూ.34 చొప్పున జమ అవుతుందని, ఇప్పటి వరకు రూ. 656 కోట్ల సొమ్ము 3 కోట్ల ఖాతాల్లో జమ అవుతోందని రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు.

 Randeep Singh Surjewala said that he will complete the work for the relief fund for the unemployed in Karnataka.

డీబీటీ ద్వారా ప్రతి నెల 97 లక్షల మంది కుటుంబ సభ్యులు నాలుగు ఉచిత హామీ పథకాల ద్వారా 4 కోట్ల 30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రస్తుత సంవత్సరంలో మా ఐదు ఉచిత హామీ పథకాలకు 38 వేల కోట్ల రూపాయలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసిందని, ప్రధానంగా ఈ నాలుగు ప్రధాన హామీ పథకాల ద్వారా రాష్ట్రంలోని 4 కోట్ల 30 లక్షల మంది లబ్ధిదారులు లబ్ధి పొందారని రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+