ఊర్లో వాళ్లు పార్లమెంట్ ఎంట్రీ పాస్ లు అడిగితే నేను అయినా, సీఎం అయినా ఇస్తారు !
పార్లమెంట్ చూడాలని ఊర్లో వాళ్లు అడిగితే తాను అయినా, సీఎం అయినా పాస్ లు ఇస్తారని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సీటీ రవి అన్నారు. మాజీ మంత్రి సీ.టీ రవి మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలు పార్లమెంట్ ను చూడటానికి పాస్ ఇప్పించాలని అడిగితే రాజకీయ నాయకులు కాదని చెప్పలేరని, అవకాశం చూసి వారిని పాస్ లు ఇప్పించడానికి ప్రయత్నిస్తారని సీటీ రవి అన్నారు.
కర్ణాటకలోని చిక్కమళూరు నగరంలో శనివారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సీటీ రవి మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పార్లమెంట్ సమావేశాల విజిటర్స్ ఎంట్రీ పాస్ ఇచ్చి ఆయన తప్పు చెయ్యలేదని, ఎంపీలు ఇలాంటి పాస్ లు ఇస్తూనే ఉంటారని, ఎవరికైనా పార్లమెంట్ సెషన్స్ చూడటానికి పాస్ లు ఇచ్చే ముందు, సిఫార్సు చేస్తున్నప్పుడు మంచి లేదా చెడును గుర్తించడానికి ఎవరికీ కంటి స్కానర్ ఉండదు అనే వియం గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి సీటీ రవి అన్నారు.

ఓ క్రిమినల్, నేర చరిత్ర ఉన్న వ్యక్తికి పార్లమెంట్ ఎంట్రీ పాస్ లు ఇచ్చినా, సిఫారస్సు లేఖలు ఇచ్చినా అది నేరం అవుతుందని, కానీ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నేరస్తులకు, క్రిమినల్స్ కు సిఫారసు చేయలేదని మాజీ మంత్రి సీటీ రవి అన్నారు. పార్లమెంట్ దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ చురుకుదనం చూస్తుంటే టూల్‌కిట్ రాజకీయం జరుగుతుందనే అనుమానం వ్యక్తమవుతోందని మాజీ మంత్రి సీటీ రవి ఆరోపించారు.

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చిక్కిన వందల కోట్ల రూపాయల స్కామ్ వెనుక స్మగ్లింగ్‌తో పాటు విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇదంతా పాక్షికంగానే జరిగిందా అనే సందేహం కలుగుతోందని, దీని వెనుక ఉన్న శక్తి ఎవరు, కాంగ్రెస్ ఎంపీకి ఎవరితో సంబంధం ఉందో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులను బీజేపీ మాజీ మంత్రి సీటీ రవి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications