వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ రాక: తల్లీకూతుళ్లపై గ్యాంగ్‌రేప్ నిందితుడు, మాజీ మంత్రి ప్రజాపతి అరెస్ట్

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ మంత్రి, ములాయం సింగ్ యాదవ్ ముఖ్య అనుచరుడు గాయత్రి ప్రజాపతిని ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులో

|
Google Oneindia TeluguNews

లక్నో: తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ మంత్రి, ములాయం సింగ్ యాదవ్ ముఖ్య అనుచరుడు గాయత్రి ప్రజాపతిని ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ప్రజాపతిని లక్నోలో అరెస్టు చేశారు.

నిందితులందరి అరెస్ట్

నిందితులందరి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ వస్తుండగానే ఇతని అరెస్ట్ కావడం గమనార్హం. కాగా, ప్రజాపతి సహా మరో ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత ప్రజాపతి ఫిబ్రవరి 27న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

17రోజులుగా అజ్ఞాతంలో..

17రోజులుగా అజ్ఞాతంలో..

గత 17 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంతకు ముందు ముగ్గుర్ని అదుపులోకి తీసుకోగా తాజాగా మంగళవారం సెంట్రల్ లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మరో ముగ్గురు పట్టుబడ్డారు.

సామూహిక అత్యాచార ఆరోపణలు..

సామూహిక అత్యాచార ఆరోపణలు..

ఆ మరుసటి రోజే(బుధవారం ఉదయం) లక్నోలో ప్రజాపతిని అదుపులోకి తీసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ, ఆమె కుమార్తెపై సమూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం అఖిలేశ్ ఆయనను పక్కన బెట్టారు.

ములాయంతో సన్నిహిత సంబంధాలు..

ములాయంతో సన్నిహిత సంబంధాలు..

అయితే ప్రజాపతికి ములాయంతో సన్నిహిత సబంధాలుండటంతో ఆయన మళ్లీ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత రేప్ ఆరోపణలో నేపథ్యంలో పరారై.. బుధవారం అరెస్టయ్యారు ప్రజాపతి.

English summary
Samajwadi party leader and former minister in the Akhilesh Yadav government, Gayatri Prajapati has finally been arrested. After being on the run for weeks, the Uttar Pradesh politician, accused in a gang rape case was arrested in Lucknow on Wednesday morning. He is expected to be produced before a magistrate after which the police will seek his custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X