వామ్మో ఘోరం: యువతిపై యాసిడ్‌తో దాడి, ఎస్సై భార్య సహా మరో ఇద్దరు కలిసి.. కాలు, చేతికి తీవ్రగాయం..
యువతి అని కూడా చూడలేదు. యాసిడ్‌తో దాడి చేయడంతో ఆమె చేయి, కాలికి గాయమైంది. ఓ పోలీసు అధికారి భార్య దగ్గరుండి మరీ దాడి చేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా యువతిపై తప్పుడు కేసు నమోదు చేసింది. దీంతో జైలుకెళ్లిన యువతి.. కొద్దిరోజుల కిందట బయటకొచ్చారు. ఆమె వచ్చారని తెలుసుకొని.. పథకం ప్రకారం యాసిడ్‌తో దాడి చేశారు.
మీరట్ సీనియర్ ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై యాసిడ్ దాడి జరగడం కలకలం రేపుతోంది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా తనపై తప్పుడు కేసు ఎస్సై భార్య నీతు పెట్టారని బాధితురాలు ఆరోపించారు. తనతోపాటు తన సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. 2018లో ఎస్సై నరేంద్ర తనతో తప్పుగా ప్రవర్తిస్తే కేసు నమోదు చేశానని.. దానికి వ్యతిరేకంగా ఎస్సై భార్య మరో కేసు ఫైల్ చేసిందని వివరించారు.

తనపై గతంలో కేసు నమోదు చేయడమే కాకుండా దాడిచేసిన నీతు సహా మరో ఇద్దరిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సివిల్ లైన్ సర్కిల్ అధికారి సంజయ్ దేశ్వాల్ ధృవీకరించారు. వీరి మధ్య వైరం రెండేళ్ల నుంచి అర్థమవుతోందని చెప్పారు. బాధిత యువతి పల్లవ్‌పురంలో ఉంటుండగా.. 2018లో బాధితురాలు ఎస్సైపై లైంగికదాడి కేసు నమోదు చేయగా.. ప్రతీగా అతని భార్య యువతిపై కేసు పెట్టింది. కేసులో బాధితురాలు జైలుకు కూడా వెళ్లింది. బెయిల్‌పై బయటకు వచ్చిన.. ఆమెపై దాడి చేశారని తెలిపారు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై నరేంద్ర ప్రస్తుతం బెహ్సుమా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారి సంజీవ్ దేశ్వాల్ తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications