పేటీఎంకు బిగ్ రిలీఫ్: ఆర్బీఐ సర్కులర్ జారీ: షేర్ల ధరలు పెరిగే ఛాన్స్
Paytm Payments Bank: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కొద్దిరోజుల కిందటే రిజర్వ్ బ్యాంక్..కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా దీనిపై నిషేధం విధించింది. ఈ నెల 29వ తేదీ తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోతాయి.

ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 300 రూపాయలకు పడిపోయింది. నేడు స్టాక్ మార్కెట్‌లో పేటీఎం సింగిల్ పీస్ ప్రైస్ రూ.341.30 పైసల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే అయిదుశాతం మేర వాటి ధర పెరిగింది.
ఈ పరిస్థితుల్లో పేటీఎం యాజమాన్యానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రిజర్వు బ్యాంక్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని సడలించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అమలు కావాల్సిన నిషేధం గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. అంటే.. మార్చి 14వ తేదీ వరకూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్, ఫాస్టాగ్ పని చేస్తాయి.
ఈ మేరకు ఆర్బీఐ ఓ సర్కులర్‌ను జారీ చేసింది. గడువులోగా పేటీఎం అకౌంట్స్, వాలెట్ నుంచి తమ నగదు మొత్తాన్ని డిపాజిటర్లు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ విధానంలో ఇతర బ్యాంకులకు తమ నగదును బదిలీ చేయించుకునే అవకాశాన్ని పేటీఎం యాజమాన్యం డిపాజిటర్లకు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
నిషేధం అమలు గడువును ఆర్బీఐ పొడిగించిన నేపథ్యంలో పేటీఎం షేర్ల ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇవ్వాళ ఒక్కరోజే అయిదు శాతం మేర షేర్ల ధరలు పెరగడాన్ని ఉదహరిస్తోన్నాయి. దీనితో సోమవారం రీఓపెన్ అయ్యే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై అందరి దృష్టీ నిలిచినట్టయింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications