నిర్మల సీతారామన్‌ను పదవి నుంచి తొలగించకపోతే.. బాంబులు పెట్టి లేపేస్తాం
Nirmala Sitharaman: ముంబైలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి అందిన బాంబు బెదిరింపు ఇమెయిల్ వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఉరుకులు పరుగు పెట్టించింది. సోదాలు, తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది. ఈ ఘటనతో ముంబైలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని, లేకపోతే బాంబులతో పేల్చేస్తామనేది ఆ మెయిల్ సారాంశం. దేశంలో ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా వారిద్దరూ అతి పెద్ద కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వెంటనే తమ పదవుల నుంచి తప్పుకోవాలని ఈ ఈమెయిల్‌లో డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌కు అనుగుణంగా రాజీనామాలు చేయకపోతే ముంబైలో వేర్వేరు ప్రాంతాల్లో అమర్చిన శక్తిమంతమైన బాంబులను పేల్చివేస్తామని హెచ్చరించారు. ముంబై వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో శక్తిమంతమైన బాంబులను పెట్టామని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ కొత్త కేంద్ర కార్యాలయం, హెచ్‌డీఎఫ్‌సీ హౌస్- చర్చి గేట్, ఐసీఐసీఐ బ్యాంక్ టవర్స్- బాద్రా కుర్లా కాంప్లెక్స్ సహా 11 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు తమకు మెయిల్ అందిందని ముంబై పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించామని, ఎలాంటి అనుమానిత వస్తువులు లేవని చెప్పారు.
ఖలిఫత్ ఇండియా అనే సెండర్ నుంచి ఈ ఈమెయిల్స్ అందాయని అన్నారు. ఇది ఎక్కడి నుంచి పంపించారనే విషయంపై ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్నామని ముంబై పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పలు చట్టాల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు సాగుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications