కరెన్సీ నోట్ల గుర్తింపు: కంటి చూపు లేనివారి కోసం ఆర్బీఐ ‘MANI’ యాప్
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కంటి చూపు సరిగా లేని వారి కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టింది. MANI(మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటీఫైయర్) అనే పేరుతో యాప్‌ను రూపొందించింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ యాప్‌ను ప్రారంభించారు.
ఈ యాప్ సాయంతో కంటిచూపు లేని వారు సులువుగా నోట్లను గుర్తించే అవకాశం ఉంది. ఒకసారి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులు ఉచితంగానే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు

ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని అధికారులు వివరించారు. అయితే, ఈ యాప్ కరెన్సీ నోటు అసలుదా? నకిలీదా? అనే విషయాన్ని మాత్రం తేల్చలేదని వెల్లడించారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తను నోట్లను రిజర్వు బ్యాంక్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్లలో మార్పులు చేసి 2016 నవంబర్‌లో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మొదట రూ. 2000, రూ. 500 నోట్లను, ఆ తర్వాత రూ. 100, రూ. 50, రూ. 10, తాజాగా రూ. 20నోట్లను విడుదల చేసింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications