వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు-అసలు విషయం ఇదీ: ఆర్బీఐ చెప్పిన గంటల్లోనే మోడీ షాకిచ్చారు!

రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదించిన తర్వాత కొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదించిన తర్వాత కొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

నరేంద్ర మోడీ మాకు ముందే చెప్పినా బాగుండేది: నారా రోహిత్, జగన్‌కే కౌంటరా?నరేంద్ర మోడీ మాకు ముందే చెప్పినా బాగుండేది: నారా రోహిత్, జగన్‌కే కౌంటరా?

నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. అంతకు కొద్ది గంటల ముందే ఈ ప్రతిపాదన పైన రిజర్వ్ బ్యాంక్ అధికారులు చర్చించి, ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో మోడీ దానిని ప్రకటించారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఎవరి ఊహకూ అందనంత గోప్యంగా, అత్యంత పకడ్బందీగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, అర్ధరాత్రి నుంచే పెద్ద నోట్లు చిత్తుకాగితాలతో సమానమని ప్రకటించడంతో దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది.

narendra modi

పెద్దనోట్ల రద్దుకు ఆర్బీఐ ప్రతిపాదన చేసిందా? లేదా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందా? అనే దానిపై చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి. అయితే, దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు తాజాగా ఆర్బీఐ సమాధానమిచ్చింది.

ఆర్బీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం.. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది గంటల ముందే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (ఆర్బీఐ) సమావేశమయ్యారు. 500, 1000 నోట్లను రద్దు చేయాలనే ప్రతిపాదన చేసి ఆ వెంటనే ప్రభుత్వం ముందుంచారు.

నిన్న అలా, నేడు ఇలా: పవన్ కళ్యాణ్ 'ఘోర తప్పిదం'.. ప్రశ్న సరే!నిన్న అలా, నేడు ఇలా: పవన్ కళ్యాణ్ 'ఘోర తప్పిదం'.. ప్రశ్న సరే!

ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ప్రధాని మోడీ ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో 86 శాతం సర్క్యులేషన్‌లో ఉన్న సొమ్ము పెద్ద నోట్లే కావడంతో ప్రభుత్వం, ఆర్బీఐ ఈ విషయాన్ని అంత్యంత గోప్యంగానే ఉంచి సంప్రదింపుల పక్రియ సాగించింది.

అనూహ్యంగా రాత్రి చేసిన నోట్ల రద్దు ప్రకటనతో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వల్ల క్యూలు కడుతూ వచ్చారు. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగింది.

నగదు విత్ డ్రాల పైన ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కనీసం ఆ మొత్తాన్ని కూడా చాలా బ్యాంకులు ఇవ్వలేకపోయాయి. నగదు పైన, పెళ్లి పైన పరిమితులు విధించారు. నోట్ల రద్దుకు గడువు విధించారు. కొన్ని చోట్ల పాత నోట్లను ఇచ్చే అవకాశం కల్పించారు. ప్రస్తుతం 30వ తేదీ వరకు బ్యాంకులో డిపాజిట్‌కు మాత్రమే అవకాశముంది. విపక్షాలు నోట్ల రద్దుపై నిప్పులు చెరగడంతో పార్లమెంటు సమావేశాలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా యాక్ట్, 1934 ప్రకారం ఏ సిరీస్ బ్యాంకు నోట్లయినా రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐకి చెందిన సెంట్రల్ బోర్డు సిఫార్సులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానంలో ఆర్బీఐ ప్రస్తావిస్తూ... నవంబర్ 8న న్యూఢిల్లీలో ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరక్టర్లు సమావేశమై నోట్ల రద్దుకు సిఫారసు చేసినట్టు తెలిపింది. ఈ కీలక సమావేశంలో మొత్తం 10 మంది డైరక్టర్లకు గాను 8 మంది డైరెక్టర్లు హాజరయ్యారు.

క్యాష్‌లెస్ - మరో షాకింగ్!: ఏటీఎం, బ్యాంకుల నుంచి తీసుకుంటే..క్యాష్‌లెస్ - మరో షాకింగ్!: ఏటీఎం, బ్యాంకుల నుంచి తీసుకుంటే..

ఆర్బీఐ చీఫ్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌తో పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్ గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, నచికేత్ ఎం.మొర్, ది కంట్రీ డైరెక్టర్ ఫర్ ది బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, భరత్ నరోత్తమ్ దోషి, మాజీ చైర్మన్ ఆఫ్ మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియర్ సర్వీసెస్ లిమిటెడ్, గుజరాత్ మాజీ చీఫ్ సెక్రటరీ సుధీర్ మన్‌కద్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ అంజులీ చిబ్ దుగ్గల్ పాల్గొన్నారు.

English summary
The RBI recommended the demonetisation of old high-denomination notes hours before Prime Minister Narendra Modi announced the move on November 8, an RTI query has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X