రాఖీ సందర్భంగా ‘ట్రిపుల్ తలాక్ బ్యాన్’ హైలెట్ చేయండి: ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తమ ప్రభుత్వ నిర్ణయం ముస్లిం మహిళలకు భద్రతను పెంచిందని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాబోయే రక్షా బంధన్ పండుగ సందర్భంగా బీజేపీ నాయకులను వారిని కలవాలని కోరారు.
సోమవారం రాత్రి పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, సీనియర్ బీజేపీ నాయకులు సమాజంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు ఎంపీలు మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలతోనూ అనుసంధానం కావాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారన్నారు. ముస్లిం స్త్రీలకు తీరని అన్యాయం చేస్తున్న త్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో ఆ వర్గంలోని మహిళలకు ఎంతో మేలు కలిగిందని చెప్పారు. ఈ క్రమంలో రక్షాబంధన్ సందర్బంగా మైనార్టీ వర్గాల మహిళలకు చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని కోరారు. కాగా, ఆగస్టు 30న రక్షాబంధన్ పండగ వస్తోంది.
ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) బిల్లును 2019లో పార్లమెంటు ఆమోదించింది. తక్షణ ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని చట్టవిరుద్ధం, భర్తకు జైలు శిక్ష విధించే నేరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ గురించి ప్రధాని చెప్పారని తెలిపారు.
తన ఇటీవల మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 4వేల మంది ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్లారని.. ఇది భారీ పరివర్తన అని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలు వార్షిక యాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందుతున్నారని నొక్కి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా హజ్ విధానంలో ఆయన ప్రభుత్వం చేసిన మార్పులు ఇందుకు కారణమన్నారు.
ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి కొత్త పేరు పెట్టడంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో చేసిన కుంభకోణాలు, పాపాలను ప్రజలు మార్చిపోవాలనే కొత్తగా ఇండియా కూటమిగా మారిందని విమర్శించారు. పేరు మాత్రమే మారిందని.. ఆ కూటమిలో ఉన్నదివారంతా అవినీతి, కుటుంబ పార్టీల నేతలేనని అన్నారు. వీరిని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రధాని మోడీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ సూచించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications