మోడీ దెబ్బ: మాయావతితో ములాయం సై! లాలూతోనే..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎఫెక్టుతో బీహార్ రాష్ట్రంలో బద్ద శత్రువులు అయిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు చేతులు కలిపిన విషయం తెలిసిందే. అదే సమయంలో లాలూ మాట్లాడుతూ.. యూపీలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలపాలని సూచించారు.
బీహార్‌లో నితీష్ కుమార్, శరద్ యాదవ్‌ల నేతృత్వంలోని జేడీ(యు), లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్డేజీ బద్దశత్రువులు. బీహార్‌లో ఈ రెండు పార్టీలు గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నాయి. అయితే, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు పార్టీలను చావుదెబ్బతీసింది. ఈ దెబ్బకు బీహార్లో నితీష్, లాలులు కలిసిపోయారు.
అదే సమయంలో యూపీలోను బీజేపీ దెబ్బకు ఎస్పీ, బీఎస్పీలు చావుదెబ్బ తిన్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు బద్ద శత్రువులు. ఇక్కడ ఈ రెండు పార్టీలదే హవా.
బీజేపీ, కాంగ్రెసు పార్టీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు పార్టీలను మట్టి కరిపించింది. ఈ నేపథ్యంలో బీహార్‌లో నితీష్, తాను కలిసిపోయినట్లు.. యూపీలో మాయావతి, ములాయం కలవాలని లాలూ చెప్పారు. దీనిపై ములాయం స్పందిస్తూ.. లాలూ మధ్యవర్తిత్వం వహిస్తే తాను ఆలోచిస్తానని ప్రకటించారు. మొత్తానికి, మోడీ దెబ్బకు ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఒక్కటవుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications