వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యవర్తిత్వంతో కృష్ణాజల వివాదానికి పరిష్కారం ! సిద్ధమేనా అని రాష్ట్రాల్ని అడిగిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో పుట్టి కర్నాటక, తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ వద్ద సముద్రంలో కలుస్తున్న కృష్ణానదీ జలాల విషయంలో నాలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలు ఉన్నాయి. వీటిపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తో పాటు బచావత్ ట్రైబ్యునల్, కేంద్ర జలసంఘం, కేంద్ర జల్ శక్తి శాఖ, సుప్రీంకోర్టు ఎన్నో ప్రయత్నాలు చేసినా, పరిష్కారాలు సూచించినా ఇప్పటికీ సమస్య అలాగే ఉంది. దీంతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకుంటారా అని సుప్రీంకోర్టు ఇవాళ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.

కృష్ణాజలాల వివాదం

కృష్ణాజలాల వివాదం


ఏపీ, తెలంగాణ, కర్నాటక మధ్య సాగుతున్న కృష్ణానదీ జలాల వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దశాబ్దాలుగా కృష్ణాజలాలపై ఆధారపడ్డ కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగిన పోరు కృష్ణా ట్రైబ్యునల్ కు చేరి అక్కడ కూడా 2010లో తుది తీర్పు వచ్చింది. అయితే వివిధ అభ్యంతరాలతో సుప్రీంకోర్టు దీన్ని నిలిపివేసింది. తర్వాత ఈ స్టే తొలగించాలని కర్నాటక కోరడంతో తిరిగి పరిశీలన జరిపిన కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ 2013 నవంబర్ లో మరో తుదితీర్పు ఇచ్చింది. అయితే 2014లో ఏపీ, తెలంగాణ విభజన తర్వాత తిరిగి రెండు రాష్ట్రాలు ఉమ్మడి ఏపీలో జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలే చేశాయి. అప్పటి నుంచి దీనిపై విచారణ కొనసాగుతోంది.

అనూహ్య పరిణామాలు

అనూహ్య పరిణామాలు

కృష్ణానదీ జలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలోనూ గత కొన్నేళ్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు ఇద్దరు బెంచ్ నుంచి తప్పుకున్నారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన జస్టిస్ డీవై చంద్రచూడ్, కర్నాటకకు చెందిన ఏఎస్ బోపన్న తమ స్వరాష్ట్రాలకు సంబంధించిన వివాదం కావడంతో ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరో బెంచ్ కు కేటాయించింది.

 మధ్యవర్తిత్వానికి సీజేఐ సూచన

మధ్యవర్తిత్వానికి సీజేఐ సూచన


కృష్ణా నదీ జలాల కేటాయింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తమ తగాదాను సామరస్యంగా పరిష్కరించుకోగలరా అని సుప్రీంకోర్టు ఇవాళ ప్రశ్నించింది.ఈ వివాదాన్ని మీరెందుకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించకూడదంటూ కర్ణాటక తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రశ్నించారు.అయితే, ఈ కేసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు తీర్పు, తుది నిర్ణయం అవసరమని దివాన్ తెలిపారు. దీంతో త్వరలో బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది సీజేఐని ప్రస్తావిస్తూ కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని సీజేఐ హామీ ఇచ్చారు.

English summary
the supreme court of india on today asks states that they are ready to resolve krishna water dispute with mediation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X